Tenth Class Marks System : రాష్ట్రంలోని పదో తరగతి మార్కుల విధానంలో భారీ మార్పులకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇక నుంచి 100 మార్కులకు తుది పరీక్షలను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.