Hyderabad : తెలంగాణ శాసన మండలి (Legislative Council) సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మూడు కీలక బిల్లులను మండలి ఆమోదించింది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ, పురపాలక సంఘాల చట్ట సవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు లెజస్లేటివ్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఒకవైపు బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు కొనసాగుతుండగానే మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందాయి.
ఇదిల ఉండగా బీఆర్ఎస్ సభ్యులు తమ నిరసనలను ముమ్మరం చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో శాసన మండలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం కమిషన్ నివేదిక పేపర్లు చింపి మండలి చైర్మన్‌పై విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలతో శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








