Sarkar Live

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల‌.. పోలింగ్ ఎప్పుడంటే..

Telangana MLC Elections 2025 | తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మ‌ధ్యాహ్నం జారీ చేసింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఈ ఎన్నికలు

MLC Elections

Telangana MLC Elections 2025 | తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మ‌ధ్యాహ్నం జారీ చేసింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఈ ఎన్నికలు (MLC Elections) జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్‌ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడ‌తారు. ఫలితాల‌ను కూడా అదే రోజు విడుద‌ల చేస్తారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఎక్క‌డెక్క‌డంటే..

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతోపాటు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్ల‌గొండ‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానుండ‌గా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 3న ప్రారంభమై మార్చి 3న ఫలితాల ప్రకటనతో ముగుస్తుంది.

ముగియ‌నున్న ప‌ద‌వీ కాలం

ప్రస్తుతం మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన టి.జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) ఎమ్మెల్సీగా ఉన్నారు. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి (Kura Raghotham Reddy), వరంగల్- ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి (Alugubelli Narsi Reddy) ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవీకాలం ముగియనుంది.

MLC Elections Shedule ఎన్నికల షెడ్యూల్ ఇలా…

  • నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 3
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 11
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 13
  • పోలింగ్: ఫిబ్రవరి 27 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు)
  • ఓట్ల లెక్కింపు: మార్చి 3

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రత్యేకత

తెలంగాణలో జరిగే ఈ ఎమ్మెల్సీ (మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్) ఎన్నికలు సాధారణ ప్రజాప్రతినిధుల ఎన్నికల కంటే భిన్నంగా ఉంటాయి. సాధారణంగా శాసనసభకు ప్రజలు ఓటు వేస్తే శాసన మండలికి ఓటు వేసే హక్కు నిర్దిష్ట వర్గాలకే మాత్రమే ఉంటుంది. ఇందులో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ చ‌దువుకున్నవారు మాత్రమే ఓటు వేసే అర్హత కలిగి ఉంటారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదేళ్లకుపైగా బోధనా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఓటు వేయగలుగుతారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?