New Ration Cards Distribution | ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈరోజు (14వ తేదీ) సూర్యాపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam kumar Reddy) పేర్కొన్నారు.
కాగా తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా 11.30 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. కొత్త రేషన్ కార్డుల (New Ration Cards)తో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422 లక్షలకు చేరుకోనుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా గడిచిన ఆరు నెలల కాలంలోనే 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందుతోందని ఆయన వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    