హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.
గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మంత్రి ట్వీట్ చేశారు. ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ జరిగే సభలో సీఎం రేవంత్ (CM Revanth Reddy) రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత.. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Ration Cards : త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు
నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ముందస్తుగానే ప్రకటిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. రేషన్ కార్డులపై ఫోకస్ పెట్టింది. స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డుల (Smart Ration Cards) ను ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో ఉన్న స్మార్ట్ రేషన్‌కార్డులను అందించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.