Telangana News | తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చక్కగా చదువుకొని నేర్చుకొని గొప్పవాడు కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతున్నాయి. స్కూళ్లు, హాస్టళ్లలోని ఉపాధ్యాయుల తీవ్రమైన ఒత్తిడితోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం కూడా ఓ విద్యార్థి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.వివరాల్లోకెళితే..
హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్న నారాయణ స్కూల్లో 7 వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వనపర్తి జిల్లాకు చెందిన లోహిత్ ను చదువు కోసం తల్లిదండ్రులు ఆ స్కూల్ లో చేర్పిస్తే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. పాఠశాలలోని టీచర్ వల్లే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లోహిత్ మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఆ స్కూల్ కు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థి బంధువుల ఆందోళనతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..