Student Suicide in Hanmakonda | హనుమకొండ జిల్లా వంగర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య (Student Suicide) ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని వనం వర్షిత శుక్రవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దీపావళి సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలకు తిరిగివచ్చిన వర్షిత, మరుసటి రోజు ఉదయం తన యూనిఫాం చున్నీతో ఉరి వేసుకున్నది. విగత జీవిగా ఉన్న వర్షితను గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న డీఈఓ వాసంతి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.
స్నేహితుల ప్రకారం, వర్షిత చదువులో ప్రతిభావంతురాలు. క్లాస్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, అందరితో కలిసిమెలిసి ఉండేది. ఆమె మరణంతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీపీఐ నేతల ఆందోళన – ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కు డిమాండ్
కాగా ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర నాయకుడు ఆదరి శ్రీనివాస్ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టి, ప్రిన్సిపాల్ ఆఫ్రిన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు, స్థానికులు, కార్యకర్తలు హాస్టల్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    