Sarkar Live

తెలంగాణలో రాజకీయ వేడి.. హీటెక్కిన ‘ఫిరాయింపుల’ వివాదం – Telangana Politics

తెలంగాణలో రాజకీయం (Telangana Politics) రోజురోజుకూ వేడెక్కుతోంది. వర్షకాలంలోనూ పాలిటిక్స్ హీటెక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంపై నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జోరందుకుంది.పార్టీలు మారడమనేది

Telangana Politics

తెలంగాణలో రాజకీయం (Telangana Politics) రోజురోజుకూ వేడెక్కుతోంది. వర్షకాలంలోనూ పాలిటిక్స్ హీటెక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంపై నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జోరందుకుంది.
పార్టీలు మారడమనేది తెలంగాణ రాజకీయాల్లో కొత్తదేమీ కాదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పలు మార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం ఫిరాయింపు వివాదం ఇంకాస్త ముదిరిందని తెలుస్తోంది. ఇది రాజకీయ వర్గాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ పెద్ద చర్చకు దారితీసింది.

ఫిరాయింపుల వెనుక కారణాలు ఇవేనా?

ఎమ్మెల్యేలు ఒక పార్టీని వదిలి మరొక పార్టీలో చేరడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరు వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో ఉండటం అవసరమని భావిస్తారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వాదనలే వినిపిస్తున్నారు. ప్రజలు తమను ఎన్నుకోవడానికి ఇచ్చిన తీర్పును సక్రమంగా వినియోగించుకోవాలంటే అధికారంలో ఉన్న పార్టీతో కలిసిపోవడం తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం ఈ వాదనలను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. పదవుల ఆశ, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ ఫిరాయింపులు జరిగాయని గట్టిగా ఆరోపిస్తున్నాయి. ఇదే అంశం రాజకీయంగా పెద్దదై, అసెంబ్లీ వెలుపల కూడా వేడెక్కింది.

ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఏమిటి?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారత్ రాష్ట్రీయ సమితి (BRS) నుంచి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. వీరిలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, చెవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఉన్నారు. వీరు ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెంతన చేరి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.

ఈ పరిణామాలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరపెట్టాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినందుకు వీరిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ మొదట ఆ పిటిషన్లపై ప్రాథమిక పరిశీలన చేసి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలందరికీ తమ వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించారు. కొందరికి అదనపు సమయం కూడా ఇచ్చారు. అయితే.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లను స్వీకరించిన న్యాయస్థానం స్పీకర్కు పలు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో స్పీకర్ కార్యాలయంలో ఈ అంశంపై దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ ఫిరాయింపుల వెనుక నిజమైన పరిస్థితులు ఏమిటి.. నిజంగా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అన్నదానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు రాకముందే ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.

ప్రజా తీర్పే ప్రామాణికమన్న సుప్రీం

ఇదే క్రమంలో సుప్రీం కోర్టులోనూ ఈ ఫిరాయింపుల వివాదం నడుస్తోంది. ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఒకసారి పార్టీ తరఫున ఎన్నికై తర్వాత వేరే పార్టీలో చేరితే అది చట్టవిరుద్ధం అవుతుంది. దీనికి అనుగుణంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టు కూడా ప్రస్తావించింది. ప్రజలు ఓటు వేసింది కేవలం వ్యక్తికి కాదని, ఆయన్ని ఎన్నుకున్నది పార్టీ కోసం కూడా అని అభిప్రాయపడింది. కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని గుర్తు చేసింది.

ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే..

కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. నియోజకవర్గాభివృద్ధి కోసం మాత్రమే ఈ అడుగు వేశామని అంటున్నారు. వ్యక్తిగత లాభాల కోసం తాము కాంగ్రెస్ వైపు వెళ్లలేదని, ప్రజలు ఇచ్చిన మాండేట్ను అభివృద్ధి కార్యక్రమాల రూపంలో వారికి తిరిగి అందించాలన్నదే తమ ఉద్దేశమని వాదిస్తున్నారు. అయితే.. ఈ మాటలు ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాయి. ప్రజల ఓటు ఒక పార్టీకి, దాని సిద్ధాంతానికి వేసినదని, ఇప్పుడు ఆ ఓటును వేరే పార్టీకే మలిచారని వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల వీరిపై యాంటీ డెఫెక్షన్ చట్టం ప్రకారం తక్షణ చర్య తీసుకోవాలని పట్టుబడుతున్నారు.

మేమింకా బీఆర్ఎస్లోనే ఉన్నాం..

ఈక్రమంలోనే ఈ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని కొత్త రాగం అందుకున్నారు. కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు జరపడం, అభివృద్ధి కార్యక్రమాల కోసం అధికారులతో చర్చలు జరపడం మాత్రమే చేశామని వారు అంటున్నారు. అసెంబ్లీ రికార్డుల్లోనూ ఇంకా తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామని, అధికారికంగా పార్టీ మార్పు జరగలేదని నొక్కి చెబుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకోవడం, అధికార పార్టీలోని నేతలతో మమేకం కావడం ఒక వ్యూహాత్మక చర్య మాత్రమేనని చెప్పుకుంటున్నారు.

స్టేషన్ఘన్పూర్లో వాగ్యుద్ధం

ఈ మొత్తం వివాదంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయన ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ఓటును అవమానపరిచారు, ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా కడియం శ్రీహరి తన వాదనను వినిపిస్తూ ప్రజల మేలు, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం ఇది అంటున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య వాగ్యుద్ధం జోరు అందుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వీరి మధ్య వివాదం ముదిరి పరస్పరణ దూషణలకు దారి తీసింది.

ప్రజల్లో మిశ్రమ స్పందన

మొత్తమ్మీద ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ప్రజల్లో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. కొందరు అభివృద్ధి కోసం తీసుకున్న సరైన నిర్ణయమని అంటుండగా, మరికొందరు ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంశం రాబోయే ఎన్నికల్లో కూడా ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?