పలు రాష్ట్రాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్
IMD Alert | దేశవ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్టాల్రకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ (IMD Alert) చేసింది. తెలంగాణతోపాటు దిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న మూడు నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. దిల్లీ ప్రాంతంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 13, 14 తేదీల్లో వర్షం కారణంగా వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, లక్నో, గోరఖ్‌పూర్, వారణాసి, మీరట్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
బీహార్‌లోని దక్షిణ జిల్లాలు గయా, పట్నా, నవాడా, భాగల్పూర్‌లలో ఆగస్టు 12 నుంచి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ అయింది. నవాడాలో గంగా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటు-తోంది. ఉత్తర బీహార్‌లో మోస్తరు వర్షాలతో పాటు- 40-50 కి.విూ వేగంతో గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాబట్టి, ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 12న రెడ్ అలర్ట్ జారీ అయింది. ఉత్తర కాశీ, రుద్ర ప్రయాగ్, చమోలీ, బాగేశ్వర్, పిథోరాగఢ్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో 13 సెంటీమీర్ల. కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. ఆగస్టు 13, 14 తేదీలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. డెహ్రాడూన్, బాగేశ్వర్‌లలో భారీ వర్షాల కారణంగా పాఠశాలలు మూసివేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్, సోలన్, షిమ్లా, సిర్మౌర్, మండీ, చంబా, కాంగ్రా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆగస్టు 12న భారీ వర్షాలు, ఆ తర్వాత 13, 14 తేదీల్లో మోస్తరు వర్షాలతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా.
Telangana Rains : ఇక తెలంగాణలో కూడా ఆగస్టు 17 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆగస్టు 13 నుంచి 17 వరకు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి, లోతట్టు- ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    