Telangana Ration Cards : పాత రేషన్‌కార్డులు తీసివేస్తారని వస్తున్న వార్తలపై తెలంగాణ సర్కారు స్పష్టత ఇచ్చింది. రేషన్ కార్డు తొలగిస్తామనే అపొహలు ఏమంత్రం నమ్మొద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. .ఏ ఒక్కరి రేషన్‌కార్డు తొలగించబోమని ఆయన హామీ ఇచ్చారు
పాత రేషన్‌కార్డులు తొలగించేది లేదు..
అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి కొత్త రేషన్‌కార్డులు (Ration Cards) జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) భరోసా ఇచ్చారు. కొత్త రేషన్‌కార్డుల కోసం పది సంవత్సరాలుగా పేదలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి కోరిక నెరవేరబోతోందని తెలిపారు. కులగణనలో నమోదు చేసుకున్న సమగ్ర వివరాల ఆధారంగానే రేషన్‌కార్డులను జారీ చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా ఎలాంటి అనుమానాలు, ఆందోళనలు పెట్టుకోనవసరం లేదని అన్నారు. గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తులు తీసుకుని అర్హతలున్నవారికి రేషన్‌కార్డులే అందజేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
New Ration Card : 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ
రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు రవాణా బిసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. ఇప్పటికే అర్హుల జాబితా రూపొందించామని తెలిపారు. దాదాపు 6.68 లక్షల కుటుంబాలకు కొత్తగా రేషన్‌కార్డులను జారీ చేస్తామని ఆయన తెలిపారు.రేషన్‌కార్డుల పంపిణీకి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని, గ్రామాల్లో సర్వే సైతం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల కుటుంబాలు ఉండగా…ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయన్నారు. కొత్తగా అర్హత కలిగిన వారందరికీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకున్నా…ఎలాంటి టెన్షన్ పెట్టుకోవల్సిన అవసరం లేదన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తే… పరిశీలించిన తర్వాత చేసి కొత్త కార్డులు ఇస్తామన్నారు.
పాత రేషన్‌కార్డులు (Old Ration Cards) తొలగిస్తారంటూ కొందరు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని….అలాంటివి ప్రజలెవ్వరూ నమ్మొద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రేషన్‌కార్డు తొలగించబోమని స్పష్టం చేశారు.పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేరుస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
,