Telangana student shot dead : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నత విద్య (United States (US)ను అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థి గుర్తుతెలియని దుండగుల చేతిలో కాల్చివేత (shot dead)కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet mandal in Rangareddy district) మండలానికి చెందిన ప్రవీణ్ (27) మాస్టర్స్ డిగ్రీ ( Master’s degree) కోసం అమెరికాకు వెళ్లాడు. మిల్వాకీలోని ఒక విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరంలో చదువుతున్నాడు. చదువుతోపాటు పార్ట్ టైమ్ పనిచేస్తూ ఉండేవాడు. ప్రవీణ్ (Praveen) నివాసానికి సమీపంలోని బీచ్ వద్ద గుర్తుతెలియని దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స అందించే లోపే తుది శ్వాస విడిచాడు.
ముమ్మరంగా పోలీసుల విచారణ
ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారాలు విచారణ చేపడుతున్నారు. దాడికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దుండుగులను పట్టుకొనేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే ఈ కేసులో పురోగతి సాధిస్తామని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే మిల్వాకీ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనుక అసలు కారణం ఏమిటి? ఇది ఓ సాధారణ దొంగతనం ఘటనా.. లేక రేసిజం (విదేశీయులపై ద్వేషం) కారణమా? అనే విషయాలపై విచారణ కొనసాగుతోంది.
కలలు సాకారం చేసుకుందామని వచ్చి..
ప్రవీణ్ చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. అతడు భవిష్యత్తు బాగుండాలని, ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని తల్లుదండ్రులు కోరుకున్నారు. ప్రవీణ్‌లోనూ ఈ సంకల్పం దృఢంగా ఉండేది. తన కలలను సాకారం చేసుకోవాలని అతడు అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు ప్రవీణ్ వెళ్లాడు. మిల్వాకీలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం (university in Milwaukee) లో చేరి తన రెండో సంవత్సరం పూర్తి చేస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ప్రవీణ్ తన విద్యను కొనసాగించేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. ఇది చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో సాధారణంగా చేసే పనే. భవిష్యత్తులో కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడి చదివాడు. కానీ ఆకస్మికంగా జరిగిన ఈ దాడితో అతని కలలు అర్థాంతరమయ్యాయి.
విదేశాల్లో భారతీయ విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం
తెలంగాణ (Telangana) నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే.. విదేశాల్లో విద్యార్థుల భద్రతపై తరచుగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. భారతీయ విద్యార్థులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతేడాది కూడా అనేక మంది విద్యార్థులు అనుమానాస్పద రీతిలో మరణించారు. అమెరికాలో గన్ కల్చర్ వల్ల హింస పెట్రేగిపోతోంది.
Telangana student shot dead : స్పందించిన ప్రభుత్వం
ప్రవీణ్ కుటుంబం అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా ఈ ఘటనపై స్పందించారు. అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం, ప్రవీణ్ కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..