Film Producer Suicide : తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె.పి. చౌదరి (Telugu film producer K P Choudhary) ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలోని సియోలిమ్ గ్రామంలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. తన ఆత్మహత్య (suicide)కు ఎవరూ బాధ్యులు కారని, కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెషన్ (depression) లో ఉన్నానని సూసైడ్‌నోట్‌లో చౌదరి పేర్కొన్నారు. తన మృతదేహాన్ని తమిళనాడులో ఉంటున్న తన తల్లికి అప్పజెప్పాలని కోరారు. కె.పి.చౌదరి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు
కె.పి. చౌదరి (44) సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. రజనీకాంత్ (Rajinikanth) నటించిన “కబాలి” చిత్రాన్ని ఆయన తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించడంతో కె.పి.చౌదరికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతోపాటు మరికొన్ని సినిమాలు ఆయన నిర్మించినా అవి అంతగా ఆడలేదు. దీంతో చౌదరి అప్పులపాలయ్యారు. సినీ రంగంలో ఎంతో మంది నిర్మాతలు పెట్టుబడులు పెట్టుబడి పెట్టి విజయాలు సాధిస్తుంటారు. వీటితోపాటే అపజయాలు చవి చూస్తారు. తాము తీసిన సినిమా ఆశించిన స్థాయిలో లాభాలను అందించకపోతే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కె.పి. చౌదరి కూడా ఇటువంటి మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది.
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు!
కె.పి. చౌదరి గారి జీవితంలో ఇటీవల ఆర్థిక సమస్యలు తీవ్రంగా పెరిగాయని సమాచారం. ఒక సినీ నిర్మాతగా పెద్ద ప్రాజెక్టులను హ్యాండిల్ చేయడం, ఆర్థిక లావాదేవీలు జరపడం పెద్ద బాధ్యత. అప్పులు, ఖర్చులు, పెట్టుబడులు ఇవన్నీ కలిసి ఒక్కోసాఆరి అనుకున్న విధంగా లాభాలు రాకపోతే తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. కె.పి.చౌదరి తన సన్నిహితుల వద్ద నుంచి అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా తిరిగి చెల్లించలేని స్థితికి చేరుకుని తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం.
K P Choudhary పై డ్రగ్స్ కేసు
కె.పి. చౌదరి 2023లో ఒక డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆయనపై డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టాలీవుడ్, కోలీవుడ్, వ్యాపార రంగాల్లోని పలువురికి డ్రగ్స్ సరఫరా చేశారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కేసు నేపథ్యంలో చౌదరి మరింత మానసికంగా కుంగిపోయారని తెలుస్తోంది.
తనను అమ్మకు అప్పగించాలని లేఖ
కె.పి. చౌదరి (K P Choudhary) గోవాలోని సియోలిమ్ గ్రామంలో కొద్ది నెలలుగా ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిసింది. తన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల కారణంగా ఒంటరితనాన్ని అలవరుచుకున్నారని సమాచారం. చివరిసారి ఆయన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో స్నేహితులు అనుమానం వచ్చి ఇంటి యజమానిని సంప్రదించారు. ఇంటికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కె.పి. చౌదరి తన తల్లిని ఎంతో ప్రేమించేవారు. సూసైడ్ నోట్‌లో తన మృతదేహాన్ని ఆమెకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..