Sarkar Live

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం

Terrible Accident : మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం (Kowdipally Mandal of Medak district)లోని వెంకట్రావుపేట గేట్‌ వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఏడాది చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Three

Accident

Terrible Accident : మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం (Kowdipally Mandal of Medak district)లోని వెంకట్రావుపేట గేట్‌ వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఏడాది చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Three Killed on the Spot) కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు (Six others were seriously injured).

ప్రమాదం ఎలా జరిగింది?

వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా (opposite directions) వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఈ కార్లలో రెండు కుటుంబాలు ప్ర‌యాణిస్తున్నాయి. కార్లు ప‌ర‌స్ప‌రంగా ఢీకొన‌డంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న దంపతులు ఎం.డి.గౌస్‌ (45), అజీం బేగం (40)తో పాటు ఏడాది వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు

ప్రమాదం(Terrible Accident) జరిగిన వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు (informed the police). పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు బాధితులను అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతానికి వారు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి ఆందోళనకరంగా (critical condition) ఉందని డాక్టర్లు తెలిపారు.

Terrible Accident : ప్రమాదానికి కారణం ఏమిటి?

కార్ల వేగం (over speeding), నిర్లక్ష్యం (negligence ) ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు డ్రైవర్లు వాహ‌నాలు న‌డిపే సమయంలో నిద్ర మత్తులో ఉన్నారా? మొబైల్ వాడటం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిందా? అనే విష‌యాల‌పై విచారణ కొనసాగుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా మరింత దర్యాప్తు చేస్తున్నారు.

నిత్య ప్రమాదాలతో ప్రజల్లో భయాందోళ‌న‌

ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రతపై చర్చకు దారితీసింది. ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవ‌డం విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతుండటంతో జనాల్లో భయం నెలకొంది. రాత్రి ప్రయాణాలు, అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలు ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?