Sarkar Live

Ration Card | రేషన్ షాపుల్లో సన్న బియ్యం తోపాటు మరిన్ని నిత్యావసర వస్తువులు

Telangana | రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ ఉగాది నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు (Ration Card Holders ) సన్న బియ్యం సరఫరా చేస్తామని పేర్కొంది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్

Fine Rice Distribution

Telangana | రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ ఉగాది నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు (Ration Card Holders ) సన్న బియ్యం సరఫరా చేస్తామని పేర్కొంది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. పేదలు కడుపునిండా తినే విధంగా మంచి నాణ్యమైన ఫైన్ రైస్ ను పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం పంపిణీలో అనేక లోపాలు ఉన్నాయని, రేషన్ షాపులలో పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం 80 శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించుకోకుండా బయట వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు.

రూ.7, 8 వేల కోట్ల రూపాయల బియ్యం పంపిణీ జరిగితే లబ్దిదారులు వండుకోకపోవడంతో అవి పక్కదారి పడుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలు కడుపునిండా తినే విధంగా మంచి నాణ్యమైన సన్న రకం బియ్యం (Fine Rice) పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నామన్నారు. ఆహారభద్రత కోసం ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.. ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజక వర్గంలో ప్రారంభించాలి. రాష్ట్రంలో 84 శాతం మందికి మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా అందించనున్నామని తెలిపారు. ఇది స్వతంత్ర భారత దేశ చరిత్రలో విప్లవాత్మక కార్యక్రమమని తెలిపారు.

Ration Card : రేషన్ షాపుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులు

రేషన్ కార్డులు కొత్తవి వొచ్చే వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా బియ్యం (PDS Rice) అందిస్తాం.. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా వారికి అందుబాటులో ఉన్న రేషన్ షాప్ లో బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం.. పేదలకు కడుపునిండా మంచి బియ్యం ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం..ఇటీవల రేషన్ డీలర్లకు కొంత కమిషన్ పెంచాం.. రేషన్ షాపుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 89 లక్షల కార్డులు (Ration Cards) ఉన్నాయి. ఇటీవల జరిగిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలలో అదనపు సభ్యులను తీసుకున్నాం.. వారందరికీ బియ్యం అందిస్తాం.. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?