- ఆ ఆరుగురిని దోపిడీ ముఠాగా పేర్కొన్న కేటీఆర్
- రేవంత్ రెడ్డి ఆరుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో తిప్పుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేటీఆర్
TG News : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి, అధికార పక్షం, ప్రతిపక్షం, ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాసేపటి క్రితం కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ సోదరులతోపాటు మరో నలుగురిని అలీబాబా అరడజన్ దొంగలతో కేటీఆర్ పోల్చడం హాట్ టాపిక్ గా మారింది.
మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో ఆరుగురు కూడిన దొంగల ముఠా తిరుగుతోందని, రాష్ట్రంలో ఉన్న కంపెనీలల్లో వసూళ్లు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ ముఠాను ఏర్పాటు చేసాడని అన్నారు. ఈ ముఠా కంపెనీల్లో వసూళ్లు చేయడమే కాకుండా కబ్జాలతో పాటు, బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డిలతో పాటు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డిలు ఈ ముఠాలో సభ్యులని కేటీఆర్ ఆరోపించారు. వీరి దందాలు, భూ కబ్జాలు,బ్లాక్ మెయిల్ లు ఎక్కడ బయటికి వస్తాయోనని కాంగ్రెస్ అవసరం లేని అంశాలను తెరమీదకు తెచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చేసిన చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








