Sarkar Live

TG TET 2024 | టెట్ అభ్యర్థులకు కీల‌క‌ అప్డేట్.. హాల్ టికెట్లు విడుదల‌య్యేది అప్పుడే..

TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణలో టెట్ కు భారీగా డిమాండ్ ఉంది. ఇటీవ‌ల టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వ‌చ్చాయి. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 26

Intermediate Results

TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణలో టెట్ కు భారీగా డిమాండ్ ఉంది. ఇటీవ‌ల టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వ‌చ్చాయి. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి త‌మ‌ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ 2024 (II) దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్ష కోసం మొత్తంగా 2,48,172 దరఖాస్తులు స‌మ‌ర్పించారు. పేపర్‌-1కు 71,655 , పేపర్‌-2కు 1,55,971 అప్లికేష‌న్లు వ‌చ్చాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు… డిసెంబర్ 26 నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 26 డిసెంబర్ 2024న అందుబాటులోకి రానున్నాయి. అభ్య‌ర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక జనవరి 1, 2025వ తేదీ నుంచి టెట్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మవుతాయి. జనవరి 20, 2025తో అన్ని పరీక్షలు ముగియ‌నున్నాయి.ఇక ఫిబ్రవరి 5వ తేదీన తుది ఫలితాలను ప్రకటించ‌నున్నారు.

టెట్ హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

  • తెలంగాణ టెట్ అభ్యర్థులు ముందుగా schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ ను సంప్ర‌దించాలి.
  • హోం పేజీలో కనిపించే ‘ Download TET Hall Tickets(II) 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • రిజిస్ట్రేషన్ (Journal Number) వివరాలతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట‌ర్ చేయాలి
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ మీకు కనిపిస్తుంది.
  • డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

TG TET 2024 పరీక్షా విధానం :

తెలంగాణ టెట్‌ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా ప‌రిగ‌ణిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు చాన్స్ ఉంటుంది. టెట్‌ పరీక్షల్లో వొచ్చిన మార్కులకు డీఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. డీఎస్సీ నియాకంలో టెట్ స్కోర్ అత్యంక కీలకమ‌ని అభ్య‌ర్థులు గ‌మ‌నించాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?