Hyderabad | తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (TG TET 2025) హాల్ టికెట్లు ఈ రోజు విడుదలవుతున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtet2024.aptonline.in (http://tgtet2024.aptonline.in)లో లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TG TET 2025 పరీక్ష జనవరి 2 నుంచి 20 వరకు జరుగుతుంది. పరీక్షా కేంద్రంలో ప్రవేశానికి అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఈ ఏడాది మొత్తం 2.75 లక్షల మంది TG TET 2025 రాయనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు DElEd, DEd, BEd, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఈ కోర్సుల తుది సంవత్సరంలో ఉండి అవసరమైన మార్కులు సాధించిన వారు కూడా పరీక్ష రాయడానికి అర్హులు.
ఎన్ని పేపర్లు అంటే…
TS TET పరీక్ష రెండు పేపర్లను కలిగి ఉంటుంది:
- పేపర్ 1 : ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి (ప్రైమరీ) వరకు బోధించాలనుకున్న అభ్యర్థుల కోసం.
- పేపర్ 2 : ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకున్న అభ్యర్థుల కోసం. ముఖ్యమైన తేదీలు
- TG TET హాల్ టికెట్లు విడుదల తేదీ: 26-12-2024
- పరీక్ష తేదీలు: 2-1-2025 నుంచి 20-1-2025 వరకు
- ఫలితాల విడుదల : 5-2-2025 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం
- అధికారిక వెబ్‌సైట్ tgtet2024.aptonline.in (http://tgtet2024.aptonline.in)ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో తెలంగాణ TET హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి. 3. మీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి
- సబ్మిట్ చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- హాల్ టికెట్‌పై పేర్కొన్న సూచనలు లేదా మార్గదర్శకాలను చదవండి. 6. ప్రింట్ తీసి పరీక్ష రోజు కోసం దాచిపెట్టుకోండి.
ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు
- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు అవసరం.
- BC కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు
- SC, ST , దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అవసరం.
TG TET సర్టిఫికేట్‌తో ప్రయోజనాలు
TG TET పాస్ సర్టిఫికెట్ ద్వారా అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అనుబంధ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. TS TET సర్టిఫికెట్ జీతకాలం పాటు చెల్లుబాటవుతుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో TET స్కోర్‌కు 20% వెయిటేజీని ఇస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 27, 2024 […]