Group 2 Exams | తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ (TGPSC) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల కాగా, పలు కారణాలతో పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 15, 16వ తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అభ్యర్థులకు నిబంధనలు ఇవీ..
గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు హాల్‌టికెట్‌తో పాటు తమ తాజా పాస్‌పోర్టు సైజు ఫొటో, ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, గాజుల వరకే అనుమతి ఉంది .ఇతర ఆభరణాలు ఉంటే లోనికి అనుమ అనుమతించబోమని అధికారులు తెలిపారు. ప్రతిఒక్కరూ చెప్పులు మాత్రమే ధరించాలన్నారు. బెల్ట్‌లు, రిమోట్ కీస్‌కు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు.
గ్రూప్ 1,3 ఫలితాలు అప్పుడే..
వచ్చే సంవత్సరం మార్చిలో గ్రూప్-1, 3 పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. గ్రూప్-2 పరీక్షలకు అంతా సిద్ధం చేశామన్నారు. టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ పుస్తకా చదవాలన్నది అభ్యర్థులే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. కాగా గ్రూప్ 2 పరీక్షల కోసం 5 లక్షల 51 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 75 శాతం ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని, ధైర్యంగా పరీక్షరాయాలని బుర్రా వెంకటేశం కోరారు. ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుందని, ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ తప్పనిసరి అని పేర్కొన్నారు. వేగంగా గ్రూప్-2 పరీక్షల ఫలితాలు ఇస్తామని, పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








