Sarkar Live

Pushpak Bus | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరిన్ని పుష్పక్‌ సర్వీసులు

Hyderabad | శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) కు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. డిమాండ్ ను బ‌ట్టి మ‌రిన్ని పుష్పక్‌ సర్వీసులను(Pushpak Bus Services ) పెంచ‌నున‌ట్లు ఆర్టీసీ(TGSRTC) అధికారులు ప్ర‌క‌టించారు. ఇప్పటికే కొన్ని బస్సులు

Pushpak Bus

Hyderabad | శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) కు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. డిమాండ్ ను బ‌ట్టి మ‌రిన్ని పుష్పక్‌ సర్వీసులను(Pushpak Bus Services ) పెంచ‌నున‌ట్లు ఆర్టీసీ(TGSRTC) అధికారులు ప్ర‌క‌టించారు. ఇప్పటికే కొన్ని బస్సులు సర్వీసులు న‌డుస్తుండ‌గా మరో 6 సర్వీసులు ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఈ బస్సులు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మీదుగా ప్ర‌యాణికుల‌కు సేవ‌లందిస్తాయి. ఈ బస్సులు మొత్తం 24 ట్రిప్పులు (Pushpak Bus ) నడుస్తున్నాయి.

Pushpak Bus టైమింగ్స్‌.. హాల్టింగ్ స్టేజీలు

Pushpak Bus Timings : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, రాణిగంజ్‌, సెక్రటేరియట్‌, రవీంద్రభారతి, హజ్‌హౌస్‌, నాంపల్లి, గాంధీభవన్‌(Gandhi Bhavan), ఎంజే మార్కెట్‌, అఫ్జల్‌గంజ్‌, బహదూర్‌పుర, ఆరాంఘర్ వ‌ద్ద హాల్టింగ్‌ల‌తో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్‌ నుంచి మధ్యా హ్నం 12.55 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11.55 గంటలకు చివరి బస్సు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 12.50 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11.50 గంటలకు చివరి బస్సు బయల్దేరుతుంది.

ప్ర‌యాణికుల‌కు త‌గ్గ‌నున్న ఖ‌ర్చులు

ప్రయాణికులకు స‌రిప‌డా బ‌స్సులు అందుబాటులో లేక‌పోవ‌డంతో చాలావ‌ర‌కు కాబ్‌, ప్రైవేట్ వాహనాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అయితే తాజాగా ఆర్టీసీ పుష్పక్‌ బస్సులను పెంచ‌డంతో ప్రయాణికులకు టెన్షన్‌ తీరనుంది. ఎక్కువ‌ డబ్బులు చెల్లించి క్యాబ్‌లు బుక్‌ చేసుకొనే ఇబ్బందుతు ఇప్పుడు తీర‌నున్నాయి.

అధికారుల తనిఖీలతో బెంబేలు

ఇక హైదరాబాద్‌ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు ముమ్మ‌రంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు భయపడి ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ (Private Travelers) బస్సులను డ్రైవర్లు వనస్థలిపురంలోనే ఆపేశారు. రవాణాశాఖ అధికారుల తనిఖీలు పూర్తయ్యే వరకు బస్సులను సిటీలోకి తీసుకెళ్లబోమని డ్రైవర్లు ప్రయాణికులకు తేల్చి చెప్పారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఆయా ట్రావెల్స్‌ కాల్‌ సెంటర్లకి కాల్‌ చేసి మాట్లాడితే వారు కూడా నిర్లక్ష్యంగా స‌మాధాన‌మిచ్చారని ప్రయాణికులు ఆరోపించారు. సరైనా పత్రాలు లేకుండా రోడ్లపై బస్సులు ఎలా నడుపుతున్నారని డ్రైవర్లను నిలదీశారు. వృద్ధులు, చంటి పిల్లలతో ఉన్న త‌మ‌ను ఇక్కడే గంటలకొద్ది నిలిపేయటం ఏంటని ఫైర్ అయ్యారు. ఇక కొందరు క్యాబ్‌లు బుక్‌ చేసుకొని వెళ్లిపోయారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?