TGSRTC job notification 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో కొత్తగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 1,743 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 అక్టోబరు 8 నుంచి అక్టోబరు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని TGSRTC తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది..
TGSRTC job notification 2025 : డ్రైవర్ పోస్టుల వివరాలు
- పోస్టుల సంఖ్య : 1000
- వయో పరిమితి : కనీసం 22 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు ఉండాలి.
- విద్యార్హత : కనీసం పదో తరగతి పాస్ అయ్యుండాలి.
- ఇతర అర్హతలు: హేవీ ప్యాసింజర్ మోటార్ వెహికిల్ (HPMV) లేదా హేవీ గూడ్స్ వెహికిల్ (HGV) లైసెన్స్ లేదా సరైన ట్రాన్స్‌పోర్టు వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ (Transport Vehicle Driving License) కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్‌లో నైపుణ్యం చూపాలి.
- పే స్కేల్: నెలకు రూ. 20,960 – 60,080 వరకు ఉంటుంది. శ్రామిక్ పోస్టుల వివరాలు
- పోస్టుల సంఖ్య : 743
- వయో పరిమితి : సాధారణంగా 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
- విద్యార్హత : సంబంధిత ట్రేడ్‌కు తగ్గ ITI సర్టిఫికేట్ తప్పనిసరి.
- ఇతర అర్హతలు : బస్సుల మరమ్మత్తులు, ఇంజిన్ పనులు, వర్క్‌షాప్ పనులు, మెకానికల్ మింటెనెన్స్ వంటి పనులు వచ్చి ఉండాలి.
- దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్‌సైట్ TSRTC రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫీజు వర్గాలవారీగా వేరువేరుగా ఉంటుంది. సాధారణ అభ్యర్థులకు ఎక్కువగా, SC/ST, బీసీ అభ్యర్థులకు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
- ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
- డ్రైవర్ పోస్టుల కోసం డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, అనుభవ ధృవీకరణ తప్పనిసరిగా సమర్పించాలి. TGSRTC job notification 2025 : ఎంపిక విధానం
- డ్రైవర్ పోస్టులు : మొదట డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్, పత్రాల ధృవీకరణ ఉంటుంది. తుది ఎంపిక పనితనంపై ఆధారపడి ఉంటుంది.
- శ్రామిక్ పోస్టులు : ట్రేడ్ టెస్ట్ లేదా వర్క్‌షాప్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫెట్లను పరిశీలిస్తారు. అవసరమైతే రాత పరీక్ష కూడా ఉండొచ్చు.
జీతం, ఇతర అలవెన్సులు
- ప్రారంభం నుంచే స్థిరమైన జీతం ఉంటుంది.
- అదనంగా EPF, ESI, సెలవులు, హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.
- అనుభవం పెరిగినకొద్దీ ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలు
- రెండు పోస్టులకు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
- రిజర్వేషన్లు (SC, ST, BC, EWS, మైనారిటీలు, మహిళలు) రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమల్లో ఉంటాయి.
- డ్రైవర్ పోస్టులకు శారీరక ఫిట్నెస్ ముఖ్యమైన అర్హతగా పరిగణిస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    