TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ (Hyderabad To Vijayawada ) మార్గంలో ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ వర్తించనుంది. అలాగే రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ వెల్లడించింది.
ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రాయితీతో కల్పించే డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని ప్రయాణికులకు సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఓ ఒక పోస్టు చేశారు. విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి టికెట్లపై ఆర్టీసీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్!!
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలను #TGSRTC యాజమాన్యం ప్రకటించింది.
లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్ల… pic.twitter.com/KpjA2rwC3J
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 19, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








