Hanamkonda : సంక్రాంతి సెలవులను (Sankranti Festival ) సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులను నడపనుంది.
అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు
వరంగల్ రీజినల్ మేనేజర్ (Warangal RTC RM) డి.విజయభాను తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్-హన్మకొండ మార్గంలో కూడా నడుపుతామని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు దిశానిర్దేశం చేసేందుకు సూపర్ వైజర్లను నియమించారు.
Sankranti Festival : బస్ స్టాపుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
సంక్రాంతి పర్వదినం (Sankranti Festival) సందర్భంగా ఉప్పల్ (Uppal) నుంచి వరంగల్ కు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టాపుల వద్ద టెంట్లు, షామియానాలు, తాగునీటి సౌకర్యం కల్పించామని తెలిపారు., ప్రయాణికులకు సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది 24 గంటలూ పని చేస్తారని రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. అంతే కాకుండా పండుగ రోజుల్లో హన్మకొండ నుంచి కొత్తకొండ, వరంగల్ నుంచి ఇనవోలు, జనగాం నుంచి కొమురవెల్లి వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








