TGSRTC special buses : మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సులను నడిపించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాలకు 3 వేల సర్వీసులను నడించనుండగా ఇవి ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు అందుబాటులోకి రానున్నాయి.
TGSRTC special buses : ఎక్కడెక్కడికి అంటే…
గత సంవత్సరంతో పోల్చితే ఈసారి 800 కి పైగా అదనపు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 43 ప్రముఖ శైవక్షేత్రాలకు ఈ బస్సులను నడపనున్నారు. ముఖ్యంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, కీసరగుట్టకు 270, ఎడుపాయకు 444. వెలాలకు 171 బస్సులు, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), దిల్సుఖ్ నగర్, ఐఎస్ సదన్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (కేఫ్‌పిహెచ్‌బీ), భెల్ వంటి ప్రాంతాల నుంచి
TGSRTC special buses : ప్రత్యేక చార్జీలు.. ముందస్తు రిజర్వేషన్లు
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ఈ ప్రత్యేక బస్సులకు టికెట్ ధరలను పునరుద్ధరించి కొత్తగా నిర్ణయించారు. సాధారణ సమయంలో ఉండే చార్జీలతో పోల్చితే కొంతమేర ఎక్కువగా ఉండనున్నాయి. భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా లేదా బస్ స్టేషన్‌లలోని రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రద్దీ కారణంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ మేర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శైవ భక్తుల కోసమే ఈ ఏర్పాట్లు : ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్
టీజీఎస్‌ఆర్టీసీ ( Telangana State Road Transport Corporation) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. బస్సుల సమర్థ నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు ఈ ప్రత్యేక బస్సు సేవలను సద్వినియోగం చేసుకొని తమకు నచ్చిన శైవక్షేత్రాలకు సురక్షితంగా వెళ్లి దర్శనాలు చేసుకోవచ్చని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








