- వరంగల్ రీజియన్ మెడికల్ ఆఫీసర్ ను మార్చాలని వేడుకుంటున్న ఆర్టీసీ కార్మికులు
- ఆర్టీసీ ఉద్యోగులపై ఆ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు
- ఔట్ సోర్సింగ్ డాక్టర్ ఆర్టీసీ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లు ప్రచారం.
- సమస్య ఉందని సంప్రదిస్తే.. అధికారులకు ఫోన్ చేసి సిక్ ఇవ్వాలా?వద్దా ?అని అధికారులను అడుగుతోందని ఆరోపిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
Warangal | ఆర్టీసీ(TGSRTC)లో ఆ మెడికల్ ఆఫీసర్ తమను చిన్నచూపు చూస్తుందని కనీసం తమకు ఏదైనా సమస్య (ఇబ్బంది) ఉంది. మాకు సిక్ లీవ్ కావాలని డాక్టర్ ను సంప్రదిస్తే కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆర్టీసీ ఉద్యోగులతోపాటు, రిటైర్డ్ కార్మికులు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ రీజియన్ లో మెడికల్ ఆఫీసర్ గా(Medical Officer) ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సదరు డాక్టర్ తన వద్దకు వచ్చే ఆర్టీసీ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ సిక్ లీవ్ కావాలంటే సంబంధిత అధికారుల నుండి లెటర్ తీసుకురావాలని హుకుం జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యపరంగా ఎమర్జెన్సీ ఉందని చెప్పినా పరీక్షించి సిక్ లీవ్ మంజూరు చేయాల్సిన డాక్టర్.. మీరు విధులు నిర్వర్తించే డిపోల నుంచి ఆధికారుల లెటర్ తీసుకురావాలని చెబుతున్నట్లు ఆర్టీసీ కార్మికులు(ఉద్యోగులు) ఆరోపిస్తున్నారు.
సజ్జనార్ సార్ ఆరా తీయండి…
వరంగల్ రీజియన్ లో ఔట్ సోర్సింగ్ (Outsourcing) ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ను మార్చాలని ఆర్టీసీ కార్మికులు(ఉద్యోగులు)తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు తమ ఆరోగ్య పరంగా ఇబ్బంది ఉందని సదరు డాక్టర్ ను సంప్రదిస్తే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మరీ ముఖ్యంగా రిటైర్డ్ కార్మికులు ఎవరైనా హన్మకొండలోని డిస్పెన్సరీ (హాస్పిటల్)కు వస్తే సదరు డాక్టర్ తమను కనీసం మనుషుల్ని కూడా చూసినట్టు చూడడంలేదని తమ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓ మహిళా ఉద్యోగి తనకు ఫలానా ప్రాబ్లమ్ ఉంది సిక్ కావాలి మేడం అని డాక్టర్ ను కలిస్తే సిక్ ఇచ్చి అదే రోజు ఫిట్ ఇవ్వడంతో ఆమె కంగుతిన్నట్లు తెలిసింది. అటు పొలీస్ శాఖలో ఇటు ఆర్టీసీలో డైనమిక్ ఆఫీసర్ గా పేరుపొందిన TGSRTC MD వీసీ సజ్జనార్ సార్ సదరు డాక్టర్ పై రీజియన్ లోని 9 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులను విచారిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని ఆర్టీసీ ఉద్యోగులు (కార్మికులు) అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..