Tiger Spotted in Medaram : తెలంగాణలోని ములుగు జిల్లా (Mulugu district) ప్రజలను మరోసారి పెద్దపులి (tiger) సంచారం భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాడ్వాయి మండలం మేడారం, బయ్యక్కపేట పరిసర అటవీ ప్రాంతాల్లో (forest areas) పెద్దపులి పాదముద్రలు (Footprints) కనిపించడం జిల్లా వాసుల్లో ఆందోళనకు దారితీసింది. అటవీ శాఖ అధికారులు (Forest department officials) పులి పాదముద్రలను గుర్తించారు. పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
Medaram : ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు
మేడారం, బయ్యక్కపేట (Medaram and Bayyakkapeta) అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలు కనిపించిన నేపథ్యంలో ఫారెస్టు అధికారులు ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం (Mahadevpur Mandal)లోని గొత్తికోయగూడెంలో ఓ ఆవును చంపిన తర్వాత పులి మేడారం వైపు కదిలినట్టు అంచనా వేస్తున్నారు. పాదముద్రలు కనిపించగానే అటవీ శాఖ అధికారులు స్పందించి, గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలతో పులి కదలికలను గమనించడానికి కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Tiger Spotted : పశువుల కాపర్లకు హెచ్చరికలు జారీ
గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఫారెస్టు అధికారులు పశువుల కాపర్ల (cattle herders)కు హెచ్చరికలు జారీ చేశారు. పశువులను అడవులవైపు మేపడానికి ఒంటరిగా వెళ్లకూడదని, సమూహంగా వెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో పశువులను తీసుకెళ్లేటప్పుడు అధిక జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
గతంలో జరిగిన పులి దాడులు
ములుగు జిల్లా గతంలోనూ పెద్దపులి సంచారానికి కేంద్రంగా మారింది. తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పులుల కదలికలు ఎన్నోసార్లు కనిపించాయి. 2023లో తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి పశువుల మందపై దాడి చేయాలని ప్రయత్నించింది. అదే సంవత్సరంలో మంగపేట మండలంలో ఓ లేగదూడను పులి దాడి చేసి చంపేసింది. కొద్దిరోజులకు మంగపేట మండలం (Mangapet Mandal) లోని శ్రీరాంనగర్ సమీపంలోని గొత్తికోయ గూడెం వద్ద మేతకోసం వెళ్లిన ఆవుల మందపై మరోసారి పులి దాడి చేసి, దూడను చంపింది. ఈ తరహా సంఘటనలు పశుపాలకుల్ని భయాందోళనకు గురిచేశాయి.
మేడారం కావడంతో మరింత అలర్ట్
మేడారం ప్రాంతం కావడం వల్ల మరింత అప్రమత్తత అవసరమని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ ( Medaram Sammakka-Saralamma) సన్నిధికి భక్తులు వస్తుంటారు. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చనే అప్రమత్తతతో మరింత జాగ్రత్తతో ముందుకెళ్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








