త్వరలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు
తిరుమల: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు తిరుమలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను (Tirumala Brahmotsavam 2025) దృష్టిలో ఉంచుకుని, టిటిడి (TTD) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, ఆరోగ్య విభాగం సిబ్బంది, తిరుమల పోలీసులతో కలిసి తిరుమలలో అనధికార వ్యక్తులు, యాచకులను ఇక్కడి నుంచి పంపించేందుకు (Beggars Eviction) ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
కల్యాణకట్ట, SV షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని షెడ్లలో చాలా కాలంగా ఉంటున్న యాచకులు, అక్రమ వ్యాపారులను తిరుమల నుంచి బహిష్కరించారు. పోలీసులు, TTD విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్ అధికారులు ఎటువంటి పర్మిట్లు లేకుండా వ్యాపారం చేస్తున్న 82 మంది అనధికార వ్యాపారులను, ఇక్కడ చాలా కాలంగా ఉంటున్న యాచకులను గుర్తించారు. వీరిని తిరుమల నుంచి పంపించేశారు. అలాగే అనుమానితుల వేలిముద్రలను కూడా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా, స్థానిక హోటళ్ళు, టీ దుకాణాలు, రిటైల్ దుకాణాల యజమానులకు పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వారి వద్ద పనిచేసే వారికి తగిన వసతి, సౌకర్యాలు కల్పించాలని. రోజు పని పూర్తయిన తర్వాత, వారికి తిరుమలలో కాకుండా తిరుపతిలో వసతి కల్పించాలని అధికారులు ఆదేశించారు. గత నెలలో ఇలాంటి జాయింట్ డ్రైవ్ నిర్వహించి 75 మందిని అక్కడి నుండి పంపించారు. భవిష్యత్తులో తిరుమల నుండి అనుమానితులు, అనధికార వ్యాపారులు, యాచకుల బెదిరింపులను అరికట్టేందుకు ఇటువంటి కార్యక్రమాలు (TTD Vigilance Drive) తరచుగా నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    