- టోల్ ఛార్జీలు (Toll charges) 50% తగ్గింపు
New Delhi : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలు ఉన్న రహదారి సెక్షన్‌లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యతో వాహదారుల ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిపోనున్నాయి.
ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్లు, సొరంగాలు, వంతెనలు వంటి నిర్మాణాలు కలిగిన జాతీయ రహదారుల్లో ప్రభుత్వం టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించింది. జాతీయ రహదారి రుసుము నియమాలు, 2008 ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వినియోగదారు రుసుములు వసూలు చేస్తున్నవిషయం తెలిసిందే..
2008లో అమలులోకి వచ్చిన నేషనల్ హైవే టోల్ నియమాలను సవరించిన మంత్రిత్వ శాఖ, కొత్త లెక్కింపు పద్ధతిని తాజా నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇందులో పేర్కొనబడిన విధంగా, టోల్ (Toll charges) లెక్కింపు నిర్మాణాల పొడవును మినహాయించి, మిగిలిన రహదారి పొడవుపై ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ప్రస్తుతం, ఇటువంటి ప్రత్యేక నిర్మాణాలకు సాధారణ టోల్ ఛార్జీల కన్నా పది రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నప్పటికీ, తాజా మార్పులతో వాటిని భారీగా తగ్గించనుంది. ఈ నిర్ణయం, వాహనదారులపై భారం తగ్గిస్తూ, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనుంది.
సవరించిన నిబంధనల ప్రకారం, ఫ్లై ఓవర్‌లు, అండర్ పాస్‌లు, సొరంగాలపై టోల్ ఫీజులను 50 శాతం వరకూ తగ్గించనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.