Raja Goutham : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో సుచిత్ర చంద్రబోస్ డైరెక్ట్ చేసిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం (Brahmanandam ) తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham). ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వారెవా, బసంతి లాంటి అరకోర సినిమాలు చేసిన కూడా నటుడిగా పేరు తెచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు. ఈయన సినిమాలు చేయక చాలా కాలమే అయిపోయింది.
గత చిత్రం షార్ట్ ఫిలిమ్స్ తీసి గుర్తింపు పొందిన ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్లో మను అనే మూవీ చేశారు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత తన తండ్రి బ్రహ్మానందంతో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) మూవీలో నటించారు.
బ్రహ్మ ఆనందంతో..
ఒకప్పుడు బ్రహ్మానందం నటించని సినిమా అనేది లేదు. పెద్ద హీరోల సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా ఆయన ఉండాల్సిందే. లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయనంత క్రేజ్ ఉండేది. దానికి తగ్గట్టుగానే రచయితలు సెపరేట్గా ఒక క్యారెక్టర్ ని సృష్టించేవారు.ఆయనపై డైరెక్టర్ల టేకింగ్ కొత్తగా ఉండేది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్వించారు. అంత బిజీగా ఉండే ఆయనకు వయసు మీద పడడంతో ఆచితూచి సినిమాలను చేస్తున్నారు. పూర్తిస్థాయి ఎక్కువ నిడివి ఉన్న కామెడీ మూవీ లో నటించక చాలా రోజులే అవుతుంది. బ్రహ్మ ఆనందం మూవీ తో ప్రేక్షకులను నవ్విస్తారని చెప్పొచ్చు.
ఈ మూవీలో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాత మనవళ్లుగా యాక్ట్ చేయగా వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో నటించారు. నిఖిల్ డైరెక్షన్ లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన స్వధార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Raja Goutham తిరస్కరించిన సినిమా
ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ఆసక్తికర విషయాలను తెలిపారు. ముందుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన గోదావరి (Godavari) మూవీ రాజా గౌతమ్ చేయాల్సిందట. మొదట ఆ కథ రాజ గౌతమ్ కి వినిపించారట. ఆ సినిమా మొత్తం హీరోయిన్ చుట్టే తిరగడం హీరో పాత్రకు సరైన గుర్తింపు రాదేమోనని ఆఫర్ ని తిరస్కరించారట. ఏదేమైనా కెరీర్లో నిలబడి పోయే ఈ మూవీ చేసుంటే హీరోగా ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్ళేదోనని నెటిజన్లో అనుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








