Nandamuri Balakrishna : ఎన్టీఆర్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. (Balayya) మొదటి నుండి కూడా వైవిధ్యమైన పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు. దాదాపు 50 సంవత్సరాల నట ప్రస్థానంలో ఎన్నో మైలురాల్లను అందుకున్నారు. పౌరాణికం, జానపదం లాంటి మూవీస్ కు మొదట గుర్తొచ్చే పేరు బాలకృష్ణ. తన తండ్రి దర్శకత్వంలో గుర్తుండిపోయే పాత్రలను ఎన్నో చేశారు.ఇప్పటికీ కూడా ఏ ఇంటర్వూ లో అయినా మా నాన్నే నాకు గురువు అని చెప్తూ ఉంటారు.
మాస్ లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకున్న బాలకృష్ణ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలతో ఆడియన్స్ ను అలరించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. జీవితంలో చాలా చిన్న వయసులోనే పెద్దన్నయ్య లాంటి పెద్దరికం పాత్రను అవలీలగా పోషించాడు. భైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలు నటుడిగా మరో మెట్టు ఎక్కించి తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
వరుస హిట్లతో మంచి జోరు మీదున్న బాలయ్య ఓ దశలో వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్డాడు. కానీ సింహా సినిమాతో మళ్లి మునుపటి ట్రాక్ ని అందుకుని అఖండ, వీర సింహారెడ్డి , డాకు మహారాజ్ ,భగవత్ కేసరి లాంటి బంపర్ హిట్లను అందించాడు.
సినిమాలే కాకుండా హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయంలోనూ తనకు సాటి ఎవరూ లేరని అనిపించుకున్నారు. ఇదే కాకుండా అంతకుముందే బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ని స్థాపించి కొన్నివేల మందికి క్యాన్సర్ పేషెంట్లకు సేవ చేస్తున్నాడు. ఇలా ఒక్క రంగానికి పరిమితం కాకుండా ప్రజారంగం లోనూ విశిష్ట సేవలు అందించారు. కళా రంగంలో చేసిన సేవకు గాను ఈ గణతంత్ర దినోత్సవం రోజున బాలకృష్ణ(Balayya) కు ప్రభుత్వం దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ (Padma Vibhushan) పురస్కారాన్ని ప్రకటించారు. తన 50 సంవత్సరాల నట జీవితంలోను ఎన్నో మైలురాళ్లను అందుకున్న నటసింహం జీవితంలో ఈ అవార్డు ప్రత్యేకంగా నిలవనుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించాక సినీ ఇండస్ట్రీ నుండి ఎంతోమంది హీరోలు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chirangeevi), జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి ఎందరో హీరోలు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. నిజం చెప్పాలంటే నటన లో ఎన్నో శిఖరాలను అందుకున్న బాలకృష్ణకు, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పేరుమీద తను చేస్తున్న సేవలకు ఏనాడో ఈ అవార్డు వరించాల్సింది..కానీ లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఈ అవార్డు బాలకృష్ణ కు వరించడంపై బాలకృష్ణ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ పురస్కారానికి అన్ని విధాల అర్హుడైన ఆయనకు తన ఫ్యాన్స్ కాకుండా మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా అభినందనలు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








