Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, నటి సరోజినీదేవి మృత్యువాత పడిన విషయం మరిచిపోకముందే సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమాలలో విలన్ గ్యాంగ్‌లో ఎక్కువ కనిపించారు. సీరియస్‌గా కనిపిస్తూనే తన స్టైల్ లో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ.. నవ్వించడం ఆయన ప్రత్యేకత. కాగా ఫిష్ వెంకట్ వయ్సు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండడంతో సినీ పరిశ్రమలో కొందరు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చందానగర్‌లోని పీఆర్‌కే హాస్పిటల్‌లో ఆయన కన్నుమూశారు.
ఫిష్ వెంకట్ తన ప్రత్యేకమైన తెలంగాణ యాసలో అద్భుతమైన కామిక్ టైమింగ్ తో కామిడీ పండించేవారు. ఇది ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. హైదరాబాద్‌లో జన్మించిన ఆయన 2000ల ప్రారంభంలో ఖుషి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి అనేక చిత్రాలలో ప్రేక్షకులను అలరించారు. హాస్య పాత్రలతో పాటు, ప్రతికూల పాత్రలలో కూడా తన నటనతో తనదైన ముద్ర వేశారు.
ఫిష్ వెంకట్ తన భార్య సువర్ణ, కుమార్తె స్రవంతితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికలపై నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    