Sarkar Live

Tollywood | దూకుడు మీదున్న కిలాడి డైరెక్టర్…

Tollywood | ఒక ఊరిలో(oka oorilo) మూవీతో మెగా ఫోన్ పట్టి హిట్టు అందుకున్నారు డైరెక్టర్ రమేష్ వర్మ (Ramesh Varma). ఆ తర్వాత రైడ్,వీర, రాక్షసుడు (raid,Veera,rakshasudu) లాంటి హిట్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. మాస్

Ramesh Varma

Tollywood | ఒక ఊరిలో(oka oorilo) మూవీతో మెగా ఫోన్ పట్టి హిట్టు అందుకున్నారు డైరెక్టర్ రమేష్ వర్మ (Ramesh Varma). ఆ తర్వాత రైడ్,వీర, రాక్షసుడు (raid,Veera,rakshasudu) లాంటి హిట్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. మాస్ మహారాజా రవితేజతో(mass maharaj Ravi Teja)కిలాడి (khilaadi)మూవీ తీసి పర్వాలేదనింపించుకున్నాడు. ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడకపోయినా డైరెక్టర్ గా మాత్రం తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

Tollywood News : లారెన్స్ తో కాలభైరవ…

ప్రజెంట్ తన సొంత నిర్మాణంలో రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. అలాగే రాఘవ లారెన్స్ తో కాలభైరవ (Kala Bhairava)అనే మూవీ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. చాలా సైలెంట్ గా మూవీని ప్లాన్ చేస్తున్న ఈ డైరెక్టర్ అతి త్వరలోనే షూటింగ్ ను కూడా మొదలుపెట్టానున్నారని తెలుస్తోంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది. రాఘవ లారెన్స్ (Raghava lawrense)తో మూవీ అంటే కచ్చితంగా మంచి బజ్ నెలకొంది. ఈ మూవీ కనుక హిట్టు అయితే తాను అనుకుంటున్న తదుపరి ప్రాజెక్ట్స్ కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంటుంది.

హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేదు…

బాలీవుడ్లో ఒక లవ్ స్టోరీ, అలాగే యాక్షన్ జానర్ లో ఓ మూవీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడట.ఇవి తెరకెక్కించాలంటే లారెన్స్ తో తీసే కాలభైరవ మూవీ మంచి హిట్ కావాల్సి ఉంది. ఒక మోస్తారుగా ఆడిన కూడా తాను బాలీవుడ్ కి వెళ్లి తన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉంటాడు. అలాగే గత సంవత్సరం బాలీవుడ్ లో కిల్ అనే మూవీ వచ్చి ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ మూవీ రైట్స్ కూడా రమేష్ వర్మ దగ్గర ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అయితే ఈ మూవీ ఆల్రెడీ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మరి తన దగ్గర ఈ మూవీ రైట్స్ ఉన్నాయంటే రమేష్ వర్మ ఏ ప్లాన్ లో ఉన్నారో తెలియాల్సి ఉంది. దీనిపై ఇంతవరకు డైరెక్టర్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏదేమైనా ఒకవైపు దర్శకుడిగా ఒకవైపు నిర్మాతగా రాణిస్తూ ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్న రమేష్ వర్మ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?