Vishwambhara Movie | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), త్రిష (Trisha) హీరో హీరోయిన్ గా బింబిసార ఫేమ్ వశిష్ట (Vashishta) డైరెక్షన్లో విశ్వంభర (Vishwambhara) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కుతున్న విశ్వంభర పై భారీ అంచనాలే ఉన్నాయి.అంజి తరవాత భారీ గ్రాఫిక్స్ ఉన్న మూవీ చిరు చేయలేదు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇటువంటి మూవీ లో తన మునుపటి చరిష్మా చూపించబోతున్నట్టు మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రజెంట్ భారీ తనంతో వచ్చిన మూవీస్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే చాలు మూవీకి కాసుల వర్షం కురిపిస్తారు. అలాగే కొంచెం తేడా కొట్టినా సినిమా భారీ నష్టాలే చవిచూస్తోంది.
ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీమ్..
ఆ మధ్య రిలీజ్ చేసిన మెగాస్టార్ గ్లింప్స్ పై నెగిటివ్ టాక్ వచ్చింది. సీజీ వర్క్ సరిగా చేయలేదనే విమర్శలను మూవీ టీమ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని సీరియస్ గా తీసుకున్న మూవీ టీమ్ దానిపై మళ్ళీ వర్క్ చేసినట్టు సమాచారం. ఎక్కువ సీజీ వర్క్ ఉంటుంది కాబట్టి మూవీ రిలీజ్ దగ్గర పడితే ఇబ్బంది అవుతుందని దానిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ మధ్య దీనిపై మెగాస్టార్ పలువురు డైరెక్టర్ లను రంగం లోకి దింపినట్టు ప్రచారం కూడా జరిగింది. ఈ షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుండి మెగాస్టార్ వరుసగా షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. రెండు పాటలు మినహా తన పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఆయన మొన్నటి వరకు రిలాక్స్డ్ గా కొత్త కథలను వినే పనిలోనే ఉన్నారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. విశ్వంభర పాటలను కంప్లీట్ చేస్తే చిన్న చిన్న పాచ్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేస్తారు.
యంగ్ డైరెక్టర్ల కాంబినేషన్ లో
ఈ మధ్య చిరుకు వచ్చిన గ్యాప్ లో అనిల్ రావిపూడి, బాబి, శ్రీకాంత్ ఓదెల ఇంకా కొంతమంది యువ డైరెక్టర్లు చెప్పిన కథలను విని తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలకు ఓకే చెబుతున్నారు. ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల తో మూవీని కన్ఫామ్ చేశారు. అనిల్ రావిపూడి మూవీ కూడా కథ ఓకే అయిపోయింది. ఇటీవల ఒక మూవీ మీటింగ్ లో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతున్నట్లు, ఎప్పుడు షూటింగ్లో అడుగుపెడదామా అన్నట్టుగా అనిపిస్తుందని సరదాగా చెప్పుకొచ్చారు. చాలా రోజుల తర్వాత ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లో యాక్ట్ చేస్తున్నానన్నారు. తనలో వింటేజ్ చిరుని చూపిస్తానన్నట్లుగా ధీమాగా చెప్పారు.
Vishwambhara ఇంట్రడక్షన్ సాంగ్ షూట్….
ఇదిలా ఉండగా ఈరోజు విశ్వంభర మూవీ (Vishwambhara Movie) ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నట్టు మూవీ టీమ్ మెగా గ్రేస్ లుక్ ని పోస్ట్ చేసింది. ఈ లుక్ లో మెగాస్టార్ అదిరిపోయాడని ఫాన్స్ సంబరపడిపోతున్నారు. కీరవాణి మ్యూజిక్ లో రామజోగయ్య శాస్త్రి పాట్ రాయగా శోభి మాస్టర్ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సాంగ్ లో తన వింటేజ్ గ్రేస్ ను గుర్తుకు తెచ్చేలా బాస్ ఇరగదీస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కీరవాణి మ్యూజిక్ లో మెగాస్టార్ వేసే స్టెప్పులకు థియేటర్ల టాప్ లెచిపోద్దంటున్నారు. కాగా సంక్రాంతికి వస్తాడనుకున్న విశ్వంభర సీజీ వర్క్ పూర్తి కానందున ఏప్రిల్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డేట్ కూడా మూవీ టీం ఇంకా కన్ఫామ్ చేయలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








