Tollywood News | సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు ఆడియన్స్ ఊహించని కాంబోలు సెట్ అవుతూ సర్ప్రైజ్ ఇస్తుంటారు. హిట్స్ లో ఉన్న డైరెక్టర్ తోనే ఏ హీరో అయినా చేయాలనుకుంటారు. అలాగే హిట్స్ లో ఉన్న హీరో తో చేస్తే నే మూవీ పై హైప్ క్రియేట్ అవుతుందని డైరెక్టర్ అనుకుంటాడు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా హిట్టు కొట్టిన వాళ్ల వెంటనే పడుతుంటారు. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ కాంబో సెట్ అయినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినబడుతోంది.
ఈ కాంబో రిస్క్ చేస్తోందా… ?
మైత్రి మూవీ మేకర్స్(maithri movie makers)బ్యానర్ లో నితిన్(nithin) హీరోగా శ్రీను వైట్ల(Sreenu vaitla)డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా నితిన్ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నారు. ఇక శ్రీను వైట్ల హిట్టు కొట్టి చాలా కాలమే అయిపోయింది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోయిన మైత్రి బ్యానర్ కు కూడా ఫ్లాఫ్ లు చూస్తున్నారు. ఈ బ్యానర్ లో ఈ ఏడాది నితిన్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన రాబిన్ హుడ్ భారీ ఫ్లాఫ్ అయింది. ఇక నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు (thammudu)మూవీ కూడా నిరాశ పరిచింది.
ఎల్లమ్మ అటకెక్కిందా…?
దీంతో బలగం డైరెక్టర్ వేణు డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన ఎల్లమ్మ (Yellamma)ప్రాజెక్ట్ అటూఇటుగా మారింది. ఇలాంటి పరిస్థితి లో శ్రీను వైట్ల కాంబో సెట్ అయినట్టు వార్తలు వస్తుండడంతో నెటిజన్స్ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. కొందరేమో ఈ ప్రాజెక్ట్ ముగ్గురికి కూడా రిస్క్ అంటుంటే.. మరికొందరూ ఈ సినిమా తో ఈ కాంబో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్టు టాక్ ఉండేది. తన కామెడీ సినిమా లు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేవి.
ఈ మూవీతో వింటేజ్ శ్రీనువైట్ల ను చూస్తామా..?
ఎన్టీఆర్ తో తీసిన బాద్ షా మూవీ తరవాత తన కెరీర్ గాడి తప్పింది. వరుసగా మూవీస్ ఫెయిల్ అవుతుండడం తో తనతో మూవీ చేసేందుకు టాప్ హీరోలు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని టైర్ టూ హీరోలతో గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తను లాస్ట్ గా గోపీచంద్ తో విశ్వం మూవీ తీయగా సినిమా ఓ రేంజ్ లో ఆడకపోయినా ఒకే అనిపించుకుంది. ఇప్పుడు నితిన్ తో తీసే మూవీతో అయినా వింటేజ్ శ్రీనువైట్ల ను చూస్తామేమో చూడాలి. ]
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








