Sarkar Live

Pushpa 2 BGM : పుష్ప -2 బీజీఎం గొడవ తగ్గేలా లేదే..

Pushpa 2 BGM : సుకుమార్ ,అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2 (Pushpa 2 ) మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ మూవీకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సినిమా మొత్తం బ్యాగ్రౌండ్ స్కోర్

Pushpa 2 BGM

Pushpa 2 BGM : సుకుమార్ ,అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2 (Pushpa 2 ) మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ మూవీకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సినిమా మొత్తం బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడా అనే అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ విషయంపై ఆ మధ్యలో గొడవలు కూడా జరిగాయి. స్టేజ్ మీద డీఎస్పీ నిర్మాతలపై తన అసహనాన్ని కూడా వెళ్లగక్కారు.

Pushpa 2 BGM : ఏదో ఒక రభస

మొదట నుంచి ఈ మూవీ బీజీఎం (Pushpa 2 BGM ) పై ఏదో ఒక రభస జరుగుతూనే ఉంది. సుకుమార్ (Sukumar)ప్రతి సినిమాకు దేవిశ్రీప్రసాద్ (DSP) సాంగ్స్ తో పాటు బీజీఎం కూడా తనే ఇచ్చాడు. రెండున్నర దశాబ్దాలుగా ఎప్పుడు ఎవరూ కూడా తన మ్యూజిక్ ని వేలెత్తి చూపింది లేదు. పుష్ప -2 మూవీ కి మాత్రం మూవీ టీమ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ల వైపు మొగ్గుచూపారు.

అందుకే సామ్ సీఎస్ (sam cs), అజనీష్ లోక్ నాథ్, తమన్ ని రంగంలోకి దింపి వారితో బీజీఎం చేయించుకున్నారు. కానీ మూవీలో తమన్, అజనీష్ లోక్ నాథ్ ఇచ్చిన బీజీఎం లను పక్కనపెట్టి సామ్ సీఎస్ బీజీఎం ను వాడుకున్నట్లు తెలిసింది. ఇదే టైటిల్ కార్డు లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సంగీతం,నేపథ్య సంగీతం అని దేవి శ్రీ ప్రసాద్ పేరుతో, అలాగే అదనపు బీజీఎం పేరుతో టైటిల్ కార్డ్స్ పడ్డాయి.

కానీ ఆ మధ్యలో సామ్ సీఎస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ కి తనిచ్చిన బిజిఎం 90 శాతం మూవీ లో వాడినట్లు తెలిపారు. దీంతో ఆడియన్స్ డిఎస్పీ మ్యూజిక్ ని బిజిఎం 10 శాతమే వాడారా అని ఆశ్చర్యపోయారు. మూవీ టీమ్ మాత్రం డీఎస్పీకే బిజిఎం క్రెడిట్ ఇచ్చింది. కానీ సామ్ సీఎస్ మాత్రం త్వరలోనే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. కలెక్షన్ల పరంగా ఈ మూవీ Baahubali-2 రికార్డ్ ను బద్దలు కొట్టింది.

ఇండియన్ మూవీ చరిత్రలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూవీగా ధంగల్ ఉంది. దాదాపు 2000 కోట్లు కొల్లగొట్టి ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ కు కొద్ది దూరంలో ఈ మూవీ ఉంది. త్వరలో చైనా లో విడుదల కాబోతున్న ఈ మూవీ ఆ రికార్డ్ ను కూడా దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓ పక్క ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుంటే ఇంకోపక్క ఈ బీజీఎం గొడవ ఇప్పట్లో తగ్గేలా లేదు. తన బీజే ఎం నే మూవీ లో వాడారని ఆడియన్స్ కి సామ్ సీ ఎస్ ఎటువంటి వీడియోని రిలీజ్ చేస్తారో చూడాలి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?