Maoist Sudhakar | మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన కొన్ని రోజులకే మరో అగ్ర నేతను పోలీసులు ఎక్‌కౌంటర్ చేశారు. చత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur) నేషనల్ పార్కు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ (Maoist Sudhakar) (65) మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా సుధాకర్ స్వస్థలం ఏలూరు (Elur) జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. 40 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో సుధాకర్ ఉన్నారు. 2004లో నాటి ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. సింహాచలం అలియాస్ సుధాకర్‌పై రూ. 50 లక్షల రివార్డు ఉంది. సుధాకర్ పూర్తి పేరు తెంటు లక్ష్మీనరసింహాచలం.
గత నెల చివర్లో, బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు, వారిలో 14 మంది తలలపై కలిపి రూ.28.50 లక్షల బహుమతి ప్రకటించారు. “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం నిశ్చయించుకుంది” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే..








