Srisailam highway Traffic jam : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం హైవే (Srisailam highway)లో ఈ రోజు అనూహ్య రీతిలో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. వేలాది మంది భక్తులు సేలేశ్వరం జాతర (Saleshwaram Jatara) కోసం తరలివస్తుండగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాల నిలిచిపోయాయి. ఈ రద్దీ వల్ల మహిళలు, పిల్లలు సహా పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఉష్ణోగ్రత మధ్య అడవి ప్రాంతంలో వాహనాలు ఆగిపోవడం భక్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు..
Traffic jam : చెక్‌పోస్టు వద్ద టూల్ వసూలో ఆలస్యం
మన్ననూర్ చెక్‌పోస్టు (Mannanur checkpost) వద్ద టోల్ ట్యాక్స్ వసూలులో ఆలస్యం కావడం వల్లే ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం. వాహనాల నుంచి అటవీశాఖ టోల్ వసూలు (toll from vehicles) చేస్తుండగా భారీ రద్దీ ఏర్పడింది. టోల్ వసూలును సమర్థంగా నిర్వహించలేకపోవడం వల్లే వాహనాలు నిలిచిపోయాయి. ఈ చెక్‌పోస్టు నుంచి సిద్దాపూర్ క్రాస్ వరకు వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అటవీ శాఖ సిబ్బంది, వలంటీర్లు రంగంలోకి దిగారు. అయినా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. రాష్ట్రంలోని అన్ని వైపులా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది.
వేలాది సంఖ్యలో భక్తులు
ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా సేలేశ్వరం (Saleshwaram Jatara) లింగమయ్య స్వామి ఆలయంలో మూడు రోజుల జాతర జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాత్రలలో ఒకటి. అంతేకాకుండా ఈ యాత్రను ప్రజలు తెలంగాణ అమర్నాథ్ యాత్ర (Telangana’s Amranath yatra) గా భావిస్తారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్య (large number of devotees)లో చేరుకుంటారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి, వారాంతపు సెలవులు, యాత్ర చివరి రోజు కలిసి రావడం వల్ల భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా భక్తులు తరలివస్తుండటంతో శ్రీశైలం హైవే పూర్తిగా భక్తులతో నిండిపోయింది. సేలేశ్వరం ఆలయం అడవిలోని కొండల ప్రాంతంలో ఉన్నందున, భక్తులు ట్రెక్కింగ్ మార్గాల ద్వారా ఆలయాన్ని చేరుకుంటున్నారు. మూడు వేర్వేరు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








