Tragic incident : అతడో వలస కార్మికుడు (Migrant Worker). వయసు 17 ఏళ్లు. మైనర్ అయిన (Minor Boy) అతడు ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో హెల్పర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఆ కాంప్లెక్స్ యజమాని అయిన వృద్ధ మహిళతో అతడికి పడేది కాదు. నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెను అతడు హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహం ముందు ఆనందంతో డ్యాన్స్ (Dance) చేస్తూ సెల్ఫీ వీడియో (Selfie Video) తీశాడు. ఆపై దానిని ఆమె బంధువుకు పంపాడు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఈ దారుణ ఘటన (Tragic incident) చోటుచేసుకోగా మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
మృతురాలు ఎవరు?
హత్యకు గురైన వృద్ధురాలు పేరు కమలాదేవి (70). రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆమె జీవనోపాధి కోసం సుమారు 30 సంవత్సరాల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబం కుషాయిగూడ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. కమలాదేవికి భర్త నుంచి వారసత్వంగా కొన్ని కమర్షియల్ షాప్స్ (Commercial Shops) లభించాయి. ఇవి మంచి ఆదాయాన్ని అందించేవి. ఆమె కుటుంబం ఆ వ్యాపార ఆదాయంతో సుఖంగా జీవించేది. 70 ఏళ్ల వయసులోనూ కమలాదేవి ఆరోగ్యంగా ఉండేది. హత్యకు పాల్పడిన బాలుడు వలస కార్మికుడు (Migrant Worker). మృతురాలి షాపుల్లో ఒకదానిలో హెల్పర్ (Helper)గా పనిచేస్తూ ఆమెకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేసేవాడు. అతని గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ అతడికి కామలాదేవితో పడేది కాదు. వారిద్దరి మధ్య తరచూ చిన్న చిన్న విషయాల్లో వాగ్వాదాలు (Arguments) జరిగేవి.
ఆగ్రహావేశంతో దారుణం
పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 11 రాత్రి సుమారు 11.30 గంటలకు ఆ బాలుడు కామలాదేవి ఇంటికి వెళ్లాడు. అప్పుడూ వారిద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఆగ్రహావేశంతో ఉన్న బాలుడు ఒక ఇనుప రాడ్ (Iron Rod)తో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడగా చీరతో గొంతు నులిమి (Strangulation) హత్య చేశాడు. ఆపై ఆమెను బెడ్‌రూమ్ ఫ్యాన్‌కు చీరతో వేలాడదీశాడు. దీంతో ఆమె మృతి చెందింది.
ఆనందంతో డ్యాన్స్ చేస్తూ..
హత్య చేసిన తర్వాత మృతదేహం ముందు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ తన మొబైల్ ఫోన్ (Mobile Phone)లో సెల్ఫీ వీడియో (Selfie Video) తీసుకున్నాడు. ఆ Shocking Footageను బెంగళూరులో ఉంటున్న కమలాదేవి బంధువుకు పంపాడు. దీనిని ఆలస్యంగా చూసిన ఆ బంధువు ఒక్కసారిగా షాక్‌కు లోనై, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
Tragic incident : రంగంలోకి దిగిన పోలీసులు
ఏప్రిల్ 14 రాత్రి బెంగళూరులోని బంధువు నుంచి సమాచారం అందుకున్నకుషాయిగూడ పోలీసులు (Kushaiguda Police)) వెంటనే రంగంలోకి దిగారు. కమలాదేవి ఇంటి తలుపులు తాళం వేసి ఉండడంతో బలవంతంగా విరగొట్టి ప్రవేశించారు (Forced Entry). లోపలికి వెళ్లి చూడగా కమలాదేవి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి (Decomposed) ఉంది. శవాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)కి తరలించారు. ఈ హత్య కేసును పోలీసులు అత్యంత సీరియస్ (Serious Case)గా తీసుకున్నారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడి కాల్ రికార్డులు (Call Records), లోకేషన్ (Location) హిస్టరీ ఆధారంగా గాలిస్తున్నారు.