ఉన్నత చదువులు, బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు యువకులు తరచూ అనేక దుర్ఘటన (Tragic incident)లకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. జీవితంలో బాగుపడతామని దేశం కాని దేశానికి వెళ్తున్న తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇటీవల ఐర్లాండ్ (Ireland)లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు.
ఐర్లాండ్‌లో గుంటూరు యువకులు
ఐర్లాండ్‌లోని కార్లో కౌంటీలోని N80 రహదారిపై గ్రైగ్యూనస్పిడోజ్ ప్రాంతంలో 2025 ఫిబ్రవరి 1 తెల్లవారుజామున 1:15 గంటలకు ఒక కారు అదుపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్ చిట్టూరి (23), సురేష్ చెరుకూరి (24) మృతి చెందారు. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందినవారు. ఈ ఘటనలో కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయినా ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. భార్గవ్, సురేష్ ఉన్నత విద్య కోసం యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom)కు వెళ్లారు. కార్లో పట్టణంలోని ఒక ఫోన్ రిపేర్ షాప్‌లో సుమారు సంవత్సరం పాటు భార్గవ్ పనిచేశాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను తెలుసుకోవడానికి స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తున్నారు.
Tragic incident in US : అమెరికాలో హైదరాబాద్ వాసి
అమెరికాలో (Tragic incident in USA)ని ఐవా రాష్ట్రంలోని ప్లైమౌత్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన మహ్మద్ వాజిద్ (28) మృతి చెందాడు. 2025 జనవరి 28న మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతడు ఒక గ్రేన్ ట్రైలర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదం K-18, C-12 హైవేల జంక్షన్‌లో జరిగింది. వాజిద్ స్టాప్ సైన్ వద్ద ఆగకుండా వెళ్లి గ్రేన్ ట్రైలర్‌ను ఢీకొన్నట్టు ఆనవాలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన వాజిద్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. చికాగో(Chicago)లో నివసిస్తూ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాజిద్ అక్కడికి వెళ్లకముందు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్‌లో జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. అతడి మృతిపై తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి మహ్మద్ షహబుద్దీన్ సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..