HSRP must : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ (Telangana Transport Department) ఓ కీలక చర్యలకు సిద్ధమైంది. 2019 ఏప్రిల్ 1 ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనంపై తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (High-Security Registration Plates (HSRP) ఉండాలనే నిబంధనను అమల్లోకి తేనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పంపింది. ఆమోదం వచ్చిన వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.
HSRP అంటే ఏమిటి?
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది ఒక ప్రత్యేక నంబర్ ప్లేట్. ఇది ఏమాత్రం బెండ్ కాని (tamper-proof), స్టాండర్డైజ్డ్ విధానంతో తయారవుతుంది. ఇందులో ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లు ఉంటాయి. వీటివల్ల వాహనం కదలికలు, దొంగతనాలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని వాహనాలపై ఒకే విధమైన నంబర్ ప్లేట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. హైడ్రోక్రోమిక్ స్టికర్, లేజర్ కోడ్, రివెట్ పిన్ వంటి ఫీచర్లు వాహనం భద్రతను పెంచుతాయి.
ఎవరికి తప్పనిసరి?
ఈ నిబంధన ప్రకారం 2019 ఏప్రిల్ 1 లోపు రిజిస్ట్రేషన్ అయిన అన్ని వాహనాలు (ద్విచక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, ఇతర వాహనాలు) తప్పనిసరిగా HSRP ప్లేట్‌ను అమర్చుకోవాలి. కొత్త వాహనాలపై ఇప్పటికే HSRP ఉంటోంది. కాబట్టి ఈ కొత్త ఆదేశాలు పాత వాహనాలకే వర్తిస్తాయి.
గడువు తేదీ ఎప్పటి వరకు?
వాహనదారులకు హెఎస్ఆర్పీ అమర్చుకోవడానికి గరిష్ట గడువు 2025 సెప్టెంబరు 30గా నిర్ణయించారు. ఆ తేదీ లోపు వాహనాలకు హెఎస్ఆర్పీ ప్లేట్ అమర్చించకపోతే సమస్యలు ఎదురుకావచ్చు.
అమర్చుకోకపోత ఏమవుతుంది?
గడువు తేదీ మించిపోయిన తర్వాత ఈ ప్లేట్ అమర్చని వాహనదారులు (Vehicle owners) కొన్ని రవాణా సంబంధిత సేవలను పొందలేరు. ముఖ్యంగా ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ (వాహనం పేరుమార్చడం), అడ్రస్ మార్పు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రిన్యువల్స్ తదితర సేవలకు అనర్హులవుతారు. అలాగే నిబంధనల ఉల్లంఘన కింద చట్టపరమైన చర్యలు ఎదురుకావచ్చు. ఇందులో భాగంగా జరిమానాలు విధించే అవకాశం ఉంది.
HSRP : నిబంధన ఎందుకు?
వాహన భద్రతను మెరుగుపర్చడానికి, వాహనాలను సమర్థంగా ట్రాక్ చేయడానికి, ఒకే విధమైన నంబర్ ప్లేట్ వ్యవస్థను అమలు చేయడానికి HSRP ప్లేట్ ఎంతో కీలకం. దీని వల్ల వాహన దొంగతనాలను అడ్డుకోవచ్చు. ట్రాఫిక్ విభాగాలకు వాహనాన్ని ట్రాక్ చేయడం సులభం అవుతుంది. రహదారి భద్రత మెరుగవుతుంది. నకిలీ నంబర్ ప్లేట్ల వినియోగాన్ని అరికట్టవచ్చు.
ఎలా పొందాలి?
మీ వాహనం 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్టర్ అయిందా? అయితే మీరు వెంటనే ఈ ది చర్యలకు పూనుకోవాలి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రభుత్వం అంగీకరించిన హై క్యూరిటీ ప్లేట్ విక్రేత వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీ వాహనం నంబర్ నమోదు చేసి, HSRP అమరికకు ఒక టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. మీ దగ్గరగా ఉన్న అథరైజ్డ్ ఫిట్టింగ్ సెంటర్‌కు వెళ్లి ప్లేట్ అమర్చించుకోవాలి. ఆన్‌లైన్‌లో మీ అపాయింట్‌మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
HSRP ప్లేట్ ఎలా కనిపిస్తుంది?
దీనిపై “IND” అనే సింబల్ ఉంటుంది. లేజర్ కోడ్ ఉన్న లేటర్ ఉంటుంది. స్టికర్ మీద బార్‌కోడ్ ఉంటుంది. ఇది వాహనానికి ప్రత్యేకమైనదిగా ఉంటుంది. డిజిటల్ రికార్డింగ్, జీపీఎస్ లింకింగ్ వంటి ఫ్యూచర్ టెక్నాలజీలకు అనుకూలంగా ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








