Trivikram Son | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) తనయుడు రిషీ (Rishi ) సినీ ఇండస్ట్రీ వైపే అడుగులు వేశాడు. తండ్రి బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నాడు. కొంత కాలంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. తండ్రి దగ్గర కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ గా కూడా వర్క్ చేశాడు. త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఏ రేంజ్ మూవీస్ తీసి నిరూపించుకున్నాడో తెలుసు. తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తే ఎంతో నేర్చుకోవచ్చు.
అయితే ఒక తన దగ్గర పనిచేస్తే సరిపోదని, బయట సమాజం ఎలా ఉందో తెలుసుకోవాలంటే వేరే డైరెక్టర్ ల దగ్గర కూడా పనిచేస్తే డైరెక్షన్లో ఇంకా మెలుకువలు తెలుసుకోవచ్చని అనుకున్నాడట. ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. ప్రతీ డైరెక్టర్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటారు. వారి స్టైల్ లో మూవీ తీసి వారి మెప్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరి క్రియేటివిటీ వారిది. డిఫరెంట్ జానర్ లో మూవీస్ తీసిన సరే ఆ మూవీలో వారి స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. వేరే డైరెక్టర్ లని అనుకరించాలని చూస్తే సినిమా ఫలితం పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.
త్రివిక్రమ్ ది కూడా ఒక డిఫరెంట్ స్టైల్. మాటలు ఒక ప్రాసలో ఉంటాయి. ఆడియన్స్ ఇవి త్రివిక్రమ్ (Trivikram) మార్క్ మాటలు అనే విధంగా తనే రాసుకుంటాడు. వేరే రచయితలు, డైరెక్టర్ లు కొన్ని మూవీస్ లో త్రివిక్రమ్ మార్క్ మాటలు రాసుకుని మూవీ స్ తీసి చేతులు కాల్చుకున్న వారు ఉన్నారు. అందుకే తన కొడుకు తన దగ్గర పనిచేసినా సరే యువ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేర్పిస్తున్నాడు. డిఫరెంట్ జానర్ లో మూవీస్ తీసే వారి వద్ద పనిచేస్తే ఇంకా కొత్తగా నేర్చుకోవచ్చని భావించినట్టు తెలుస్తోంది.
ప్రజెంట్ విజయ్ దేవరకొండ మూవీకి
అందుకే ప్రజెంట్ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి (vijay Devarakonda -Gotham thinnanoori) డైరెక్షన్ లో వస్తున్న మూవీకి అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు.ఈ మూవీ సెట్స్ పై ఉంది. తనలో తండ్రికి తగ్గట్టే చాలా క్రియేటివిటీ ఉందని తెలుస్తోంది. తన డైరెక్షన్ కలను సాకారం చేసుకునేందుకు మరో క్రేజీ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ గా చేరబోతున్నాడట.
Trivikram క్రేజీ కాంబినేషన్ లో ఛాన్స్…
త్వరలో ప్రభాస్ తో (prabhas) స్పిరిట్ మూవీ తీయబోతున్న సందీప్ రెడ్డి వంగ (sandeep reddy vanga) దగ్గర పనిచేస్తే ఇంకా డైరెక్షన్ లో మెలుకువలు నేర్చుకోవచ్చని త్రివిక్రమ్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే వారి టీమ్ ని సంప్రదించి చేర్పిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న మూవీలో అసిస్టెంట్ గా ఛాన్స్ రావడం ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ అక్కడ ఉన్నది త్రివిక్రమ్ కొడుకు కాబట్టి సులువే అవుతుంది. డైరెక్ట్ గా త్రివిక్రమ్ అడిగితే సందీప్ కాదనగలడ. అలా ఓ పాన్ ఇండియ క్రేజీ కాంబినేషన్ లో త్రివిక్రమ్ తనయుడు భాగం కాబోతున్నాడట.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..