UIDAI | దేశంలో ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కేంద్రం కీలక అడుగు వేసింది. UIDAI (భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ) ఇప్పటివరకు 1.17 కోట్ల ఆధార్ నంబర్లను బ్లాక్ చేసింది. ఈ ఆధార్ నంబర్లన్నీ మరణించిన వ్యక్తులకు చెందినవి.
ఈ చర్య ఎందుకు తీసుకున్నారు..?
చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని UIDAI చెబుతోంది. వాటి ద్వారా ఎలాంటి మోసం, స్కామ్ జరగవచ్చు. దీనిని నివారించడానికి, చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు తెలిపింది.
ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు చురుకైన పాత్ర పోషించాలని UIDAI కోరింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక వ్యక్తి మరణించిన వెంటనే అతని ఆధార్ నంబర్‌ను రద్దు చేయాలని కోరుకుంటోంది. దీని కోసం, మరణ ధృవీకరణ పత్రం జారీ చేసేటప్పుడు దానిని ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేస్తున్నారు.
దుర్వినియోగాన్ని ఎలా నిరోధించవచ్చు?
మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును వెంటనే రద్దు చేసే కొత్త వ్యవస్థపై UIDAI పని ప్రారంభించింది. వారి ఆధార్ నంబర్‌ను ఏ ప్రభుత్వ పథకం లేదా సౌకర్యంలోనూ మళ్లీ ఉపయోగించలేరు. ఇది నకిలీ గుర్తింపు, మోసాన్ని నివారిస్తుంది.
ఎవరైనా మరణించినపుడు , కుటుంబ సభ్యుడు మరణ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆధార్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది. సంబంధిత వ్యక్తి మరణించారని UIDAIకి తెలియజేయాలి. దీని తరువాత అతని ఆధార్ నంబర్ డియాక్టివేసట్ చేస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    