UPSC Civil Services 2025 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)-2025 నోటిఫికేషన్ జారీ అయ్యింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) ఎగ్జామినేషన్‌కు ప్రకటన విడుదలైంది. 979 సివిల్ సర్వీసెస్, 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పోస్టులను భర్తీ చేయనున్నారు. 2024 సంవత్సరం నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య కాస్త తగ్గించారు. అయినా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ఎంతో ప్రధానమైనది. యూపీఎస్సీ పరీక్షల ద్వారా తమ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకొనేందుకు ఇదెంతో చక్కని అవకాశం. దేశానికి సేవ చేయడానికి ఒక గొప్ప ప్లాట్‌ఫాం. కఠినమైన శ్రమతో కూడుకొని ఉన్నా సమర్థమైన ప్రణాళిక, పట్టుదలతో ఈ లక్ష్యాన్ని సాధించుకోవచ్చు.
పరీక్ష రాయడానికి అర్హతలు:
సివిల్ సర్వీసెస్ :
- UPSC Civil Services 2025 ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- – డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్:
అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇంజనీరింగ్, వైజ్ఞానికం లాంటి ప్రత్యేక విభాగాల్లో డిగ్రీ ఉండాలి.
వయో పరిమితి:
- కనిష్ట వయసు: 21 సంవత్సరాలు
- గరిష్ట వయసు: 32 సంవత్సరాలు (జనరల్ అభ్యర్థులకు)
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు.
- పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు.
దరఖాస్తు ప్రక్రియ
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ జనవరి 22, 2025న ప్రారంభమైంది.
- చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2025.
- UPSC అధికారిక వెబ్‌సైట్ (www.upsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు
- జనరల్ కేటగిరీ: రూ. 100
- ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
- ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉంది.
ఎంపిక ప్రక్రియ:
యూపీఎస్సీ పరీక్షలు మూడు దశల్లో ఉంటుంది.
- ప్రిలిమినరీ పరీక్ష (Prelims):
- ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి:
- 1.జనరల్ స్టడీస్ (GS) పేపర్ 1, 2.సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT).
- మొత్తం 400 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు క్వాలిఫయింగ్ మార్కులు సాధించాలి.
UPSC Civil Services 2025 మెయిన్స్ పరీక్ష (Mains):
- ఇది సబ్జెక్టివ్ రాత పరీక్ష.
- మొత్తం 9 పేపర్లు ఉంటాయి:
- భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, నైతికత తదితర ప్రధాన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
- మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపిక అవుతారు.
- ఇంటర్వ్యూ (Interview):
- 275 మార్కులకు దీనిని నిర్వహిస్తారు.
- అభ్యర్థుల వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిజ్ఞానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రత్యేక వివరాలు
- సివిల్ సర్వీసెస్ & ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమ్స్: ఈ రెండు పరీక్షలకు ప్రిలిమ్స్ ఒకటే ఉంటుంది.
- మెయిన్స్, ఇంటర్వ్యూ విడివిడిగా నిర్వహిస్తారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు
- అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి యూపీఎస్సీ వెబ్‌సైట్ సందర్శించండి.
- మెయిన్స్ పరీక్షలకు కావాల్సిన ఆప్షనల్ సబ్జెక్టుల జాబితాను పరిగణనలోకి తీసుకోండి.
- సిలబస్‌ను బాగా అర్థం చేసుకోవాలి.
- డైలీ న్యూస్‌పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి.
- కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- స్టడీ మెటీరియల్స్ సమకూర్చుకొని బాగా ప్రిపేర్ కావాలి.
- NCERT పుస్తకాలు మొదట చదవాలి.
- ప్రమాణిత గ్రంథాలు, ప్రాక్టీస్ టెస్టులు చేయడం అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరం.
టైమ్ మేనేజ్‌మెంట్
- రోజువారీ ప్రిపరేషన్‌కు గంటలను కచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి.
- మాక్ టెస్టులు రాయడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం వస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..