US Consulate jobs : నిరుద్యోగులకు శుభవార్త. తక్కువ విద్యార్హతతో ఉన్నత స్థాయి ఉద్యోగం పొందే అవకాశం లభించనుంది. హైదరాబాద్‌లో మంచి జీతానికి ఫుల్‌టైమ్ జాప్ చేయాలనుకొనే వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది యూఎస్ కాన్సులేట్. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (NIV) అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హతలు
- హైస్కూల్ పూర్తి చేసి ఉండాలి.
- ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- కనీసం ఒక ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. (తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియాలో ఏ ఒక్కదానిలోనైనా)
- ఏవైనా ఇతర స్కిల్స్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్‌లో నైపుణ్యం (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, అవుట్‌లుక్) ఉండాలి.
ఎంపిక విధానం (US Consulate jobs Selections)
దరఖాస్తులను పరిశీలించాక షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఏవైనా ఉన్నాయా? అని పరిశీలిస్తారు. ఇవి రెండూ విజయవంతంగా పూర్తి చేసుకుంటేనే తదుపరి ప్రక్రియ ప్రారంభవుతుంది. విద్యార్హతలు, స్కిల్స్ తదితర అంశాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
వేతనం, ఇతర అలవెన్సులు
ఎంపికైన అభ్యర్థి వార్షికంగా రూ. 9,11,851 వేతనం పొందతారు. ఇది మాత్రమే కాకుండా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ కింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు
- రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా నివాస ధ్రువీకరణకు చెల్లుబాటు అయ్యే ఇతర పత్రాలు కలిగి ఉండాలి.
- వర్క్ అనుమతి (అవసరమైతే)
- హైస్కూల్ సర్టిఫికెట్
- విశ్వవిద్యాలయ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల జాబితా (అవసరమైతే)
దరఖాస్తు ప్రక్రియ
Application for US Consulate jobs ఆసక్తి ఉన్న అభ్యర్థులు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ:
డిసెంబర్ 26, 2024.
చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా, సమయానికి ముందు దరఖాస్తు చేయడం మంచిది. యూఎస్ కాన్సులేట్ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుంటే మంచిది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి:
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








