Sarkar Live

US urges Peaceful Resolution | విభేదాల‌ను ప‌రిష్క‌రించుకోండి.. బంగ్లా, భార‌త్‌కు యూఎస్ సూచ‌న‌

US urges Peaceful Resolution : బంగ్లాదేశ్‌లో భార‌తీయులపై జ‌రుగుతున్న దాడుల నేప‌థ్యంలో యూఎస్ స్పందించింది. రెండు దేశాల మ‌ధ్య ఉన్న విభేదాల‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇటీవ‌ల భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్రమ్ మిశ్రి బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించిన

US urges Peaceful Resolution

US urges Peaceful Resolution : బంగ్లాదేశ్‌లో భార‌తీయులపై జ‌రుగుతున్న దాడుల నేప‌థ్యంలో యూఎస్ స్పందించింది. రెండు దేశాల మ‌ధ్య ఉన్న విభేదాల‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇటీవ‌ల భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్రమ్ మిశ్రి బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా అక్క‌డ మైనారిటీలైన భార‌తీయుల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలపై ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో భార‌త‌దేశం, బంగ్లాదేశ్ మ‌ధ్య ఉన్న విభేదాలను ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌రంపై యునైటెడ్ స్టేట్స్ మాట్లాడింది. స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్ర‌తినిధి మాథ్యూ మిలర్‌ ఈ మేరకు మీడియా స‌మావేశంలో ప్ర‌క‌టించారు.

Matthew Miler ఏమ‌న్నారంటే..

భార‌త్, బంగ్లాదేశ్ మ‌ధ్య ఉన్న విభేదాల‌న శాంతియుతంగా ప‌రిష్క‌రించుకొనే ఆస్కారం ఉంద‌ని, దీన్ని ఇరు దేశాలు ప‌రిశీలించాల‌ని మిలర్‌ సూచించారు. భార‌త విదేశాంగ మంత్రి విక్ర‌మ్ మిశ్రి (Vikram Misri) బంగ్లాదేశ్‌ను సంద‌ర్శించిన అంశంపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు మిల్ల‌ర్ స‌మాధానంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

భార‌తీయులకు భ‌ద్ర‌త లేద‌న్న మిశ్రి

బంగ్లాదేశ్ (Bangladesh) లో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మిశ్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు భ‌ద్ర‌త లేద‌ని అన్నారు. దాడుల నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌కు భార‌త్ (India) హెచ్చ‌రిక‌లు జారీ చేసిన త‌ర్వాత కూడా అక్క‌డి మైనారిటీల (భార‌తీయులు)పై 88 దాడులు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిణామాలను విక్రమ్ మిశ్రి తీవ్రంగా ప‌రిగ‌ణించారు. బంగ్లాదేశ్ మ‌ధ్య‌వ‌ర్తి ప్ర‌భుత్వంతో భార‌త్ స‌న్నిహితంగా ప‌నిచేయాల‌నే కోరిక‌ను నేను వెల్ల‌డించాను. కొన్ని ప‌రిణామాలు, స‌మ‌స్య‌లపై చ‌ర్చించే అవ‌కాశాన్ని కూడా వ్య‌క్త‌ప‌రిచాను. ఇందులో మైనారిటీల భ‌ద్ర‌త‌, సంక్షేమ అంశాల‌ను కూడా పొందుప‌ర్చాను అని త‌న ప‌ర్య‌ట‌న అనంత‌రం ధాకాలో మీడియాతో మాట్లాడుతూ మిశ్రి అన్నారు. సానుకూల, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకరం సంబంధాల‌ను భార‌త్ కోరుకుంటోంద‌ని స్ప‌ష్టం చేశారు.

భార‌తీయుల‌పై దాడులు తీవ్ర‌త‌రం

బంగ్లాదేశ్‌లోని షేక్ హ‌సీనా (Shaik Haseena) ప్ర‌భుత్వంపై ఆగ‌స్టులో తిరుగుబాటు పోరాటం తీవ్ర‌త‌ర‌మైంది. ఇది అక్క‌డ యుద్ధ వాతావ‌ర‌ణానాన్ని సృష్టించింది. విద్యార్థి స‌మూహాల విస్తృత నిర‌స‌న మ‌ధ్య ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి ప‌రిస్థితులు అనేక మలుపులు తిరిగాయి. ఈ క్ర‌మంలోనే యూనుస్ నేతృత్వంలో అక్క‌డ మ‌ధ్య‌వ‌ర్తిత్వ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. అనంత‌రం భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత క్లిష్ట‌మ‌య్యాయి. రాజీనామా అనంత‌రం షేక్ హ‌సీనా భార‌త్‌లో ఆశ్ర‌యం కోర‌గా ఆమె అప్ప‌గింత‌పై బంగ్లా మ‌ధ్య‌వర్తిత్వ ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. హ‌సీనాకు భార‌త్ స‌హ‌క‌రిస్తోందని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి భార‌తీయుల‌పై దాడులు తీవ్ర‌మ‌య్యాయి.
ఈ నేప‌థ్యంలో బంగ్లాలో మైనారిటీలైన భార‌తీయుల‌ భద్రత విషయాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి త‌న ప‌ర్య‌టన సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌భుత్వం వ‌ద్ద ప్ర‌స్తావించారు. బంగ్లా ప‌రిణామాలపై భార‌త్‌కు ఉన్న ఆందోళ‌న‌ను తెలియజేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?