Valentines Day : ప్రేమ అనేది ఒక భావన మాత్రమే కాదు.. హృదయాన్ని హత్తుకునే గొప్ప అనుభూతి. ప్రేమంటే.. ఒకరిని మరొకరు సమర్థించుకోవడం, ఆదరించడం, అర్థం చేసుకోవడం, సమయం కేటాయించడం. కేవలం మాటల్లోనే చెప్పలేనిది, హృదయంతో మాత్రమే అర్థం చేసుకోగలిగేదే ప్రేమ. నిజమైన ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. ఎలాంటి పరిమితులు లేకుండా రెండు మనసులను కలిపే శక్తిని కలిగి ఉంటుంది.
ప్రేమకూ ఓ ప్రత్యేక రోజు
మానవ సంబంధాల్లో ప్రేమకు ప్రథమ స్థానముంది. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సొంత వ్యక్తుల మధ్య ప్రేమ ఇలా అనేక రకాలు. ఇందులో ప్రతి ఒక్కదానికీ ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రపంచం ప్రేమ వల్లే ముందుకు సాగుతోంది. అయితే.. ప్రేమంటే రెండు మనసుల మధ్య కలిగే ఒక మధురానుభూతి మాత్రమేననే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ బలంగా నాటుకుపోయింది. మనకు నచ్చిన వ్యక్తికి దగ్గర కావడమే ప్రేమ అనుకుంటారు చాలా మంది.
ఈ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా జరుపుకునే ప్రత్యేక రోజు ఒకటుంది. అదే.. వాలెంటైన్స్ డే.
Valentines Day చరిత్ర
History Of Valentines Day : వాలెంటైన్స్ డే పేరు వెనుక ఒక హృదయ విదారక కథ ఉంది. మూడో శతాబ్దంలో రోమ్ (Rome) చక్రవర్తి క్లాడియస్ II తన సైనికులు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఇది సెయింట్ వాలెంటైన్ (Saint Valentine) అనే క్రైస్తవ మత గురువుకు నచ్చలేదు. రోమ్ చక్రవర్తి ఆజ్ఞకు విరుద్ధంగా ప్రేమికులకు రహస్యంగా ఆయన వివాహం జరిపించేవాడు. చివరికి ఈ విషయం ఆ రాజు దృష్టికి వెళ్లింది. వాలెంటైన్‌ను అతడు జైల్లో బంధించాడు. ఈ క్రమంలో జైల్లో ఉండగా వాలంటైన్ ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఆమె జ్ఞాపకాలతోనే బతికాడు. చివరకు చనిపోయే ముందు ఆమెకు From your Valentine అనే లేఖను రాశాడు. అదే ఇప్పటి ప్రేమ సందేశాలకు ప్రేరణ అని చాలామంది నమ్ముతారు.
భారతదేశంలో ప్రేమ కానుకలు
ప్రేమను వ్యక్తపరచడానికి బహుమతులు గొప్ప సాధనం. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ప్రేమికులు పాటిస్తుంటారు. మన భారతదేశంలోనూ ఇది ఆచరణలో ఉంది. కాకపోతే.. ఎప్పటికీ ట్రెడిషనల్‌గానే కాకుండా కొంగొత్త ట్రెండ్‌తో ఇది అప్‌డేట్ అవుతోంది.
- ముఖ్యంగా మన ఇండియాలో వాలంటైన్స్ డే (Valentines Day ) సందర్భంగా జంటలు గులాబీలను ప్రేమ కానుకలుగా ఇచ్చి పుచ్చుకుంటారు. ఎర్రగులాబీలు ప్రేమకు ప్రతీకగా భావిస్తారు.
- తమ ప్రేమలోని మధురానుభూతికి ప్రతీకగా ప్రేమికులు చాక్లెట్స్‌ను పంచుకుంటారు.
- కొంతమంది సొంతంగా డిజైన్ చేసిన కస్టమ్ గిఫ్టులను తమ లవర్‌కు అందజేస్తారు.
- మరికొంతమంది కస్టమ్ కప్పులు, టీషర్టులు, ఫొటో ఫ్రేమ్స్ గిఫ్టుగా ఇస్తారు.
- టెక్నాలజీ ఎంత పెరిగినా చేతితో రాసిన ప్రేమ లేఖకు ఉన్న ప్రత్యేకత ఎందులోనూ ఉండదని భావిస్తారు కొంత మంది ప్రేమికులు. తమ సొంత హ్యాండ్ రైటింగ్‌తో రాసిన లెటర్‌ను లవర్‌కు అందజేస్తారు.
- తనను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని కొంత మంది నగలు, ఇతర విలువైన బహుమతులు కూడా ఇస్తుంటారు.
Valentines Day Celebrations : ఇతర దేశాల్లో వేడుకలు ఇలా..
- ఇటలీలో ప్రేమ నిత్యమైనది అనే నమ్మకంతో జంటలు శృంగారభరిత కవితలు రాసుకుంటారు.
- దక్షిణ కొరియాలో ఫిబ్రవరి 14న అబ్బాయిలకు అమ్మాయిలు
- ప్రపంచలంలోనే అత్యంత రొమాంటిక్ దేశంగా పేరొందిన ఫ్రాన్స్‌లో ప్రేమికులు లవ్ నోట్స్, శృంగార కవితలు రాసుకుంటారు.
- వాలంటైన్స్‌డేను ఫిలిప్పీన్స్ దేశస్తులు అత్యంత శుభదినంగా భావిస్తారు. ఈ సందర్భంగా అక్కడ సామూహిక వివాహాలు జరుగుతాయి.
- డెన్మార్క్‌లో వాలంటైన్స్‌డే సందర్భంగా ప్రేమికులు పూల బదులు హస్తకళా బొమ్మలు (handmade cards) ఇచ్చుకుంటారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..