స్పష్టం చేసిన హన్మకొండ డీఐఈవో గోపాల్
హన్మకొండ డీఐఈవో (Hanamkonda DIEO) స్పందించారు. ఆ కాలేజీకి అనుమతులు లేవని స్పష్టం చేశారు. “బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్” కు రిపోర్ట్ రాసి పంపిస్తామని తెలిపారు. హన్మకొండ నగరంలో ఎలాంటి అనుమతి లేకుండా అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్న వైనంపై సోమవారం “అనుమతి లేని వేదాంతు“అనే శీర్షికన సర్కార్ లైవ్ కథనం వెలువరించింది.
ఈ కథనం పై స్పందించిన హన్మకొండ డీఐఈవో గోపాల్ (DIEO Gopal) మాట్లాడుతూ వేదాంతు (Vedantu) కు విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతి లేదని దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు కు రిపోర్ట్ రాసి పంపిస్తామని సర్కార్ లైవ్ ప్రతినిధితో అన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని ,అకాడమీ పేరుతో కళాశాల నిర్వహించడం సరికాదని డిఐఈవో తెలిపారు. కాగా ఇప్పటికే సదరు యాజమాన్యం అనుమతి లేకుండానే అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల నుండి ఫీజుల రూపంలో లక్షల రూపాయలు వసూళ్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    