Sarkar Live

Vemulawada | వేములవాడ ఆలయం మూసివేతతో భక్తుల్లో నిరాశ

ఆలయ ద్వారాల ఎదుటే పూజలు నిర్వహిస్తున్న భక్తులు కరీంనగర్: వేములవాడలోని ప్ర‌సిద్ధ‌ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Temple) బుధవారం పూర్తిగా మూసివేశారు. మ‌హ‌దేవుడికి ప్ర‌తీక‌ర‌మైన కార్తీక మాసం కావ‌డంతో సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు వేముల‌వాడకు పోటెత్తుతున్నారు. అయితే

Vemulawada Temple

ఆలయ ద్వారాల ఎదుటే పూజలు నిర్వహిస్తున్న భక్తులు

కరీంనగర్: వేములవాడలోని ప్ర‌సిద్ధ‌ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Temple) బుధవారం పూర్తిగా మూసివేశారు. మ‌హ‌దేవుడికి ప్ర‌తీక‌ర‌మైన కార్తీక మాసం కావ‌డంతో సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు వేముల‌వాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆల‌య ప్ర‌ధాన ద్వారాలు మూసివేయ‌డంతో అక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

పునరుద్ధరణ పనులు జరుగుతుండటంతో, అధికారులు దర్శనాలను నిలిపివేసి ఆలయ ప్రాంగణాన్ని సీజ్ చేశారు. సమీపంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, అనేక మంది భక్తులు ప్రధాన ఆల‌యానికి సంబంధించిన‌ మూసివేసిన ద్వారం వద్ద పెద్ద సంఖ్య‌లు భ‌క్తులు పూజలు నిర్వహించారు.

భక్తులు ప్రధాన ద్వారం వద్ద ఆలయ పశ్చిమ భాగంలో ఉన్న శివుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్ట‌డం, దీపాలు వెలిగించడం, ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం క‌నిపించింది. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమ‌ని, అందుకే ఆలయాన్ని మరికొన్ని రోజులు తెరిచి ఉండాలని భ‌క్తులు కోరుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు. భక్తులు భీమేశ్వర ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?