విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ (victory Venkatesh, Trivikram)కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత వెంకీ చేయబోతున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో ఓ రికార్డును క్రియేట్ చేశారు. వెంకీ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు.
కామెడీ లో వెంకీ సత్తా ఏంటో మరోసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూపించింది అని చెప్పొచ్చు. తర్వాత వెంకీ ఏ జానర్ లో మూవీ చేస్తారో అని అందరూ వెయిట్ చేశారు. మళ్ళీ కామెడీ ఎంటర్టైనర్ తో నే ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న మూవీ నే చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాంటి మూవీస్ తీయడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కాంబోలో ఆ జానర్ లో మూవీ వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే.
Venkatesh : ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్..?
ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కడతారని చెప్పొచ్చు. అలాంటి ఓ స్టోరీనే త్రివిక్రమ్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిందట. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం.?
వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను మూవీ టీం ఒకే చేసిందట. ఈ క్రేజీ టైటిల్ తోనే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వెంకీ త్రివిక్రమ్ కాంబో రాబోతున్నట్టు అర్థమవుతుంది. వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి హిట్టు మూవీస్ కి త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసారు. ఇప్పుడు డైరెక్టర్ గా ఆ సినిమాల రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉంటుందని టాక్. ఆల్రెడీ త్రిషను హీరోయిన్ గా కూడా ఒకే చేశారట. రెండో హీరోయిన్ పై వేట కొనసాగుతోంది. ఆగస్టు చివరిలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మూవీ టీం ప్లాన్ చేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.