విక్టరీ వెంకటేష్(victory Venkatesh ) సంక్రాంతికి వస్తున్నాం (sankrathiki vasthunnam)మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత స్పీడ్ పెంచారు.యంగ్ హీరోలే ఇయర్ కి ఒక మూవీ కష్టంగా రిలీజ్ చేస్తుంటే వెంకీ మాత్రం వచ్చే ఏడాది మూడు సినిమాలతో కనువిందు చేయనున్నాడు. రీసెంట్ గా రానా నాయుడు-2(Rana naidu-2)వెబ్ సిరీస్ తో ముందుకొచ్చాడు.
డోస్ తగ్గించిన రానా నాయుడు..
ఫస్ట్ సీజన్ లో వెంకీ పై విమర్శలు వచ్చాయి. అందులో కొన్ని సీన్స్ వెంకీ చేయవలసింది కాదని, అలా ఆయన్ని ఊహించుకోలేమని ఫ్యామిలీ ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈసారి మాత్రం సెకండ్ సీజన్ లో డోస్ తగ్గించి రిలీజ్ చేశారు. ఇక అనిల్ రావిపూడి చిరు (Anil ravipudi chiru combo)కాంబోలో వస్తున్న మూవీలో ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టు కూడా టాక్ వినబడింది. ఈ రోల్ కోసం రెండు వారాల డేట్స్ కూడా అరేంజ్ చేయబోతున్నారట.
త్వరలో Venkatesh జాయినింగ్…
జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లో వెంకీ త్వరలోనే జాయిన్ అవ్వబోతున్నారట. వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే f 2, f 3 , సంక్రాంతికి వస్తున్నాం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇక త్రివిక్రమ్ (Trivikram)డైరెక్షన్ లో కూడా ఓ మూవీ తెరకెక్కనున్నట్టు తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. కొద్ది రోజుల్లోనే కొబ్బరికాయ కూడా కొట్టబోతున్నారు. పూర్తి ఫన్ జోనర్ లో హై ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా స్టోరీ ఉంటుందని టాక్.
ఒకేసారి రిలీజ్…
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి మూవీస్ లా ఈ మూవీ కూడా పంచ్ లతో అదరగొడుతారని తెలుస్తోంది.వెంకీ ఖాతాలో ఉన్న మరో మూవీ దృశ్యం3. జీతూ జోసెఫ్ (jeethu josefh) డైరెక్షన్ లో మలయాళంలో మోహన్ లాల్(Mohan lal) హీరోగా తెరకెక్కబోతుంది.స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.హిందీలో అజయ్ దేవగన్ (Ajay Devgan) హీరోగా చేయనున్నారు. ఈ మూడు లాంగ్వేజెస్ లో ఒకేసారి తెరకెక్కించే అవకాశం లేకున్న మూడింటిని ఒకేసారి రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. వెంకీ ఈ మూడు సినిమాలను కూడా వచ్చే ఇయర్ లో విడుదల అవుతాయి. వచ్చే ఇయర్ లోనే అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ మూవీ చేస్తారు. ఇలా వెంకీ సినిమా మీద సినిమా పెడుతూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.