Victory Venkatesh : ఫ్యామిలీ ఆడియన్స్ కి అప్పటి తరంలో శోభన్ బాబు తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)అని చెబుతారు. ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తారు మనకు తెలిసిందే. ఎక్కువగా వారిని దృష్టిలో పెట్టుకుని సినిమాలను చేస్తుంటారు. కెరీర్లో మొదట యాక్షన్ సినిమాలను చేసిన తర్వాత ఫ్యామిలీ మూవీస్ చేసి అభిమానులను పొందారు.
ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా ఉండి పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఒకరి రికార్డులను మరొకరు కొల్లగొడుతూ మంచి మంచి సినిమాలను తీశారు. వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు.
కానీ ఈ నలుగురిలో మెగాస్టార్ (Megastar) మాత్రమే ఒక ఫీట్ సాధించారు. సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో 200 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి న హీరోగా ఆ ఫీట్ రెండుసార్లు అందుకున్నారు. మిగిలిన ఈ ముగ్గురు హీరోలు మాత్రం దానిని అందుకోలేకపోయారు.
బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ తో 100 కోట్ల మార్క్ దాటిన ఈ ఫీట్ కి దగ్గరగా రాలేకపోయాడు. ఈ సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ (Daaku maharaj) కూడా 200 కోట్లను అందుకోలేకపోయింది. విక్టరీ వెంకటేష్ ఎఫ్2 సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరారు. తర్వాత 75వ మూవీ గా వచ్చిన సైంధవ డిజాస్టర్ గా నిలిచింది. కింగ్ నాగార్జున మాత్రం ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్లో కూడా చేరలేకపోయాడు.
Victory Venkatesh : 200 కోట్ల క్లబ్ లో చేరుతుందా.. ?
రీసెంట్ గా ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) మూవీ ఐదు రోజుల్లోనే 160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కాబట్టి వెంకటేష్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచింది. 200 కోట్ల క్లబ్లో చేరడానికి ఇంకో నాలుగైదు రోజులు పట్టొచ్చు. ఈ మూవీకి వస్తున్న ఆదరన చూస్తే ఇంకా కలెక్షన్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ నలుగురు సీనియర్ టాప్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత 200 కోట్ల క్లబ్లో చేరబోయే హీరోగా విక్టరీ వెంకటేష్ నిలువనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..